Friday, January 17, 2025

Miscellaneous writing and poems

 కవితలన మనోహర భావములు

దిలించు హృదయ సీమలను

ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.
----+++
వచనాను వాదములు రచనాను కూలములు
 పచనమ్ముగాని పచ్చికూరల వలెను.
వండుకొనుట యను పనియుండ దసలు;
పాటరూపమున పాయసమ్మగును.
--------
Sometimes too much brevity can impede understanding, especially when the context is highly nuanced and the reader is not any pundit.
---+++---
నరకుని జంపిన మగువకు
సరకే యెన్నగ పలువురు సవతులు, వారే
తరుణికి బలగమగుదురని
పరవాలేదను కొనినది పసిగట్టినదై.
------+
ఆ.వె:
విధివ శాత్తు వారు వేరు పడిరి
తప్పి పోయి, తమ తప్పు గాదు
వృధ్ధ నారి వగచె విపరీత మగురీతి
ముదిని గనగ సఖికి ముదము గలిగె
------
తనదు ప్రియుని గనక తమకము తోడను
బాధ పడుచు నుండె బాల చాల
ప్రియుడ వచ్చు వేళ వెలుగుల జిమ్ముకౌ
ముదిని గనగ సఖికి ముదము గలిగె
-----
నేనొక్కడుత్తముడ నిక తదితరులు గారు
మానవత నాకెరుక మనుషులెవ్వరు లేరు
ఇలలోన భూమాత కేదిదిక్కనుచు నెవరు
కలలుగను చుందురు కల్లమాటలు జోరు!
-------
ఎందరెందరొ ఘనులు ఎనలేని త్యాగములు
ముందు వారెందరొ
వందనీయులగు వారు వారి త్యాగ ఫలములు
అనుభవించుచు మనము- అటువంటి వారలను
అను నిత్యము ను దూలి - అనరాని మాటలను
మాటలే యీటెలుగ - మాటిమాటికి ఘనుల
కోటి కోతలతోడ - కొండాడుటది యేల

@@@@@@@
రెండు శ్రీరంగములొక్కటే కావేరి
రెండు చోట్లను నుండె శ్రీరంగ నాథుండు
రెండు చోట్లను నుండె దేవేరి
చెరి యొక వైపు నొకడె దేవుండు!
--&-------
కవితలన మనోహర భావములు
కదిలించు హృదయ సీమలను
ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.   
@@@@@@

తెరచి వుంచిన‌ కిటికిలోకి
తెరలు తెరలై వీస్తుంది
పిల్లతెమ్మెర తనకు తానె
రమ్మంటే రాదు.

తెరచి వుంచిన‌ మనసులోకి
చల్ల చల్లగా వీస్తుంది,
శాంతి వీచిక తనకు తానె!
రమ్మంటే రాదు.

చెయ్యగలిగిన దేముంది
తియ్యుటే మనసు తలుపులను.

@@@@@

ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.
----+++
వచనాను వాదములు రచనాను కూలములు
 పచనమ్ముగాని పచ్చికూరల వలెను.
వండుకొనుట యను పనియుండ దసలు;
పాటరూపమున పాయసమ్మగును.
--------
Sometimes too much brevity can impede understanding, especially when the context is highly nuanced and the reader is not any pundit.
---+++---
నరకుని జంపిన మగువకు
సరకే యెన్నగ పలువురు సవతులు, వారే
తరుణికి బలగమగుదురని
పరవాలేదను కొనినది పసిగట్టినదై.
------+
ఆ.వె:
విధివ శాత్తు వారు వేరు పడిరి
తప్పి పోయి, తమ తప్పు గాదు
వృధ్ధ నారి వగచె విపరీత మగురీతి
ముదిని గనగ సఖికి ముదము గలిగె
------
తనదు ప్రియుని గనక తమకము తోడను
బాధ పడుచు నుండె బాల చాల
ప్రియుడ వచ్చు వేళ వెలుగుల జిమ్ముకౌ
ముదిని గనగ సఖికి ముదము గలిగె
-----
నేనొక్కడుత్తముడ నిక తదితరులు గారు
మానవత నాకెరుక మనుషులెవ్వరు లేరు
ఇలలోన భూమాత కేదిదిక్కనుచు నెవరు
కలలుగను చుందురు కల్లమాటలు జోరు!
-------
ఎందరెందరొ ఘనులు ఎనలేని త్యాగములు
ముందు వారెందరొ
వందనీయులగు వారు వారి త్యాగ ఫలములు
అనుభవించుచు మనము- అటువంటి వారలను
అను నిత్యము ను దూలి - అనరాని మాటలను
మాటలే యీటెలుగ - మాటిమాటికి ఘనుల
కోటి కోతలతోడ - కొండాడుటది యేల

@@@@@@@
రెండు శ్రీరంగములొక్కటే కావేరి
రెండు చోట్లను నుండె శ్రీరంగ నాథుండు
రెండు చోట్లను నుండె దేవేరి
చెరి యొక వైపు నొకడె దేవుండు!
--&-------
కవితలన మనోహర భావములు
కదిలించు హృదయ సీమలను
ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.   
@@@@@@

1.తెరచి వుంచిన‌ కిటికిలోకి
తెరలు తెరలై వీస్తుంది
పిల్లతెమ్మెర తనకు తానె
రమ్మంటే రాదు.

తెరచి వుంచిన‌ మనసులోకి
చల్ల చల్లగా వీస్తుంది,

శాంతి వీచిక తనకు తానె!
రమ్మంటే రాదు.

చెయ్యగలిగిన దేముంది
తియ్యుటే మనసు తలుపులను.
--------@@@@@@----

2.స్వకీయమ్: నాడు - నేడు

నాడు:
తలపులు కలలై కలతల లతలై
కంటకములకవి కాఠిన్యపు చెలులై

నా మస్తిష్కపు పాలిటి వలలై
నా సృజనాత్మకయే బలియై

అష్టకష్టము లలము కొనెను నాడు
నష్ట పోయితిని నేనిష్ట సిద్ధినపుడు

నిలచితి నేనెండిన కాసారముగా
అలసిన నేనుంటిని నిస్సారముగా!

నేడు:

జీవనమున ప్రాప్తికి లోటు లేదు 
జీవితమున తృప్తికి చోటులేదు.

చేయి వదలెను నాడు చదువులకు మాత
పోయి మరలెను నేడు దయగలిగి కొంత.

ముదిమి వయసులోన పలకరించె నన్ను
మదిలోన మెదలి తానలరించె నన్ను!


@@@@@

3.ఇద్దరు చంద్రులు

ఘనులు మీరెల్లరును-కనుగొనిరి చందురుని
ఎనలేని శ్రమకోర్చి - ఎంతొ దూరమ్ముజని;
ఖనిజములు గలవచట- కనుగొంటి రేయచట
*ఘనమైన జలములను- కనులార గనిరచట;
మీరు గను చందురుడు-మేముగను చందురుడు
వేరులే, గారొకడె - వెర్రిగా జూడకుడు;
మా చందమామ యన- మనసులకు రారాజు
ఏ చందమో కనగ-ఎంత కలుగునొ మోజు;
వెండి పళ్ళెము మెరిసి- వెన్నెలల గురిపించు
పండు వెన్నెల గురిసి- పండుగల మురిపించు;
శీతకిరణుడు వాడు- చేయు దూరము చింత
లేత వెలుగులలోన- లీనమై పులకింత;
ఉప్పొంగు మదిలోన- ఉడుకుడుకు యోచనలు
ఎప్పుడెపుడనిపించు-నెద మీటు సూచనలు;
సుధజల్లి మనసులను- చూరగొను చందురుని
హృదయాల మధురిమల- నెగదోయు చందురుని
కనులార మనసార-గాం, చితిరె మధుకరుని
కనుగొంటిరా మీరు- కల్లమాటలె గాని!
@@@@@@@@@


-----+--+++++++++(!++--&&&&&&&+


త్య్రత్య్రత్య్రతత్య్రత్య్రయ్తతయతతత్య్రతతతతత్య్రతత్య్రత్య్రయత్య్రత్య్రత్య్రైయ్
@#@@@@#
4. సీమానందమ్:

రాయలేలిన నేల
రాయలేలిన వేళ
రంజిలు చుండె చాల.

చెరువు కట్టలు గట్టి
నీరు నిల్వగ బెట్టి
కరువులను అరికట్టి
గుడుల నెన్నియొ గట్టి
పూర్తి జేసిరి పనులు
కీర్తి నొందిరి ఘనులు.

ప్రతి చెరువు సంద్రమె
ప్రతి భవనమింద్రమె
ఘనత నెంతయొ గనమె
కనుల కద్భుత మనమె.

ఊరూర మందిరము
ఉవ్వెత్తు గోపురము
ఊరించు సంబరము
ఊర ప్రతి వత్సరము.

గుడులన్నియు బడులై
బడులు చదువు మడులై
బుడతలు చదువరులై
మనిరి నీతి పరులై!
 ------_---------_--&------
#5. హంపీ క్షేత్రమ్:
*కలల వారాశి యై
కళల కాణాచియై
మలుపు కొక మందిరము
తెలుపు పుర సోయగము.%

*చెలువముల శిల్పములు
కలబోసి అందములు
కలువ పూవుల చాలు .

*అల రాచ వీధులందు
పలు దుకాణములందు
మేలు రతనముల నింపి
అలరారెగా హంపి.

*తుంగభద్ర మిలమిలలు
తుంగ భద్ర గలగలలు 
బ్రదుకులకు వెన్నెలలు.





ఎడారిలో యిసుక వేడెక్కి చల్లారు
తడారి పోయి నేల తహతహలాడు.

జీవితంలో సుఖ దుఃఖాలు సహజమంటారు. కానీ కొందరికి దుఃఖమొకటే దిక్కు. 



6.కొన్ని బ్రదుకులదేలొ కన్నీటి కథలెపుడు
ఉన్నన్ని నాళ్ళు పడు నేవొ కష్టము లెపుడు;

లవలేశ మగు ఆశ లైనను కలుగకుండు
భవితపై కోరికలు బలహీనమగుచుండు

భారముగ నడచుచూ బ్రదుకు దుర్భరమగును
సారహీనముగనై చావె మేలుగనగును
7. ముందు చూపు:
అప్పుడే ఐదేళ్ళు- అత్త వారిని దరిమి
ఇప్పుడే పిలగాడు-ఎంత పొడుగోయమ్మి!
ఈడొస్తె వీడికీ- ఇల్లాలు వచ్చునే
కోడలెట్లుండునో-గుబులుగా నుండెనే!
చిన్ని నా తండ్రినీ -చేయునా దూరమ్ము
కన్నకొడుకునువీడి-*కడగాల కష్టమ్ము
తప్పించు మనినేను-తగినన్ని ముడుపులను
చెప్పవయ్యా స్వామి -చెల్లించు కొనగలను! 

*(కడగాల=వేరుకాపురము)
_----------------________₹₹₹
8.నేనే దుఃఖాన్ని,
భవిత లోకి జొరబడే గతాన్ని
మస్తిష్కంలో మసలుతునే వుంటాను.
అస్తిత్వాన్ని కొరికేస్తూ వుంటాను.
అహాన్ని పెంచుతాను
ఆనందాన్ని త్రుంచుతాను.
అహరహము రూపు మార్చుతుంటాను.
అన్ని విధముల భ్రమలలో ముంచుతాను. 
@@@@@@@##@@@
9.స్వప్న సౌధము (Free Verse)

 ఊహల సౌధమును నేను
మోహముతో గట్టినాను-
తీపి గురుతులలము కొనగ
జ్ఞాపకములె పునాదులుగ!

లోచనములు కవి తలపులు
నిజమున కవియే తలుపులు

సహనము మమకారమ్ములు
గృహమునకవియే మండనములు

కనవలెను కలలు సతతము
మనసుకగును సంతసము.
********--------_--------*******
10.ఋతు నివేదనము

*ఇంత తొందరయేల- ఋతు పవనమా నీకు
ఇంత కొలదిగ గురిసె- ఎదురు చూసిన మాకు.

* తొందరగ వచ్చెదవు- తొందరగ వెళ్ళెదవు
తొందరేలనొ నీకు- దూరమై పోయెదవు.

*నిలువ వేలనొ యెపుడు- నీవనంత పురమున
అలుసేలనో నీకు-అలుకగా నుండెనా.

*చేరవచ్చిన నీవు- చెదరి పోయెదవేల
పారిపోయెద వేల - పవనమా, పరుగేల

*అదిగదిగొ వచ్చెనని - ఆశపడు చుండెదము
పదునైన గానిమ్ము- పరదేశ మేగకుము.
-----------------------

11.వ్రాయుటదేలా
ఎందరెందరొ కవులు-ఎన్నెన్నొ విధములను
అందమైన పలుకుల -నల్లరే కవితలను
మరల వ్రాయుట యేల- మర్రి వృక్షము చాలు
విరమించ మనువారు- వెర్రివారగు జనులు;

కనరాని మేరుగని - కైలాస పర్వతము 
చినబోవ నెంచునె - శివుడికే వాసమ్ము
గంగ పారుట ఘనమె - గలగలా గోదారి
పొంగదే పలుమారు - పొరలు వార్ధిగ మారి

కవికుల గురువు తాను -కాళిదాసుండెనని
కవులూర కుండిరే - కవిత వ్రాయుట మాని

ఎవరెస్టు గొప్పదే - ఎన్ని లేవు నగములు
ఎవరి గొప్ప వారి-దెన్నియో ఘనతలు!
+++++++++++++++++++++++++

An effort at free verse in English for a change :(criticism welcome)
@@@@@@&&&&&&

మల్లెపూలు అమ్మి, అమ్మి,(posted FB2)
మల్లె పూలమ్మే అమ్మి
మనసు మురిసెను సుమ్మి
మల్లె వాసన గ్రమ్మి!
_----------_--------_--------

*12. తిమిరమ్_1 

చిరు దివ్వెలతో చీకట్లు -
ఆడతాయి ముచ్చట్లు.

మనసు లోని చీకట్లకు
మనిషితోటి చెలగాటం

వేయి వెలుగులు విరిసి
లోకమంతటను మెరిసి
తుదకు పోవును సమసి.

తిమిరమన్నది సత్యం
తిమిరమన్నది నిత్యం.

తిమిరం _2

జనని గర్భంలో కలదంధకారం
జగతిగర్భంలో తుదకంధకారం.

సృష్టిలోని సమస్తం
లయమగుట సత్యం.
పాలపుంతలైన
యుగాంత మందున
అంతమొందుట తథ్యం.

మిగిలేది నిబిడాంధ కారం
అంతు లేనిదా అంధకారం.

ఆలోచన కతీతంగా:
(అన్ని విధముల విమర్శకు ఆహ్వానం).
_-------_--------_---------


జవాబు లేని ప్రశ్న
(Beyond thought, beyond belief) :

తిమిరం:3

కనుచూపు తోటి
కనగలము కొంత
మనిషి తన మేధతో
కనుగొనును మరింత
ఎనలేని భావనాపటిమతో
అనుభవమగును కొంత
మనసు గెలిచి పరమాత్మ
ననుభూతి చెందుటొక వింత;

ఎన్ని దెలిసిన మనిషి 
మదిలోన సంశయము
  వెన్నాడుచునెయుండు 
వదలదది నిశ్చయము.

"కలదేమిటిన్ని విశ్వముల కావల
కలదేమిటీ సృష్టికంత వెలుపల"?

జంతు స్థాయి దాటని జడుడైన నేమి
జటా జూట ధారి యగు జతి యైన నేమి
పరమాత్మ నెరిగిన పరమపావనుడేమి
ఎరిగింప లేరు, వారె యెరుగంగలేరు

దీపమున్న చోట వెలుగు నీడలు కలుగు
పాప చింతన లేని బ్రదుకె మనిషికి వెలుగు. 

@@@#####£££&&&


Writing about darkness:
I have recently posted a poem about darkness in 3parts. I think it would in order to clarify why I wrote that.
One fine evening, we had started our journey on a road with sparse traffic. Slowly the evening light faded and the sky had a thin covering of clouds. 
It had got progressively darker and darker with only the head lights showing the road ahead. 
I observed the hills and the trees and the fields getting gradually consumed by the darkness. It was overwhelming in its power and my mind raced with thoughts about the perpetual struggle of light against darkness. This darkness in the wilderness dulls your sense of sight but enhances the sense of sound. When the vehicle stopped at a place, the sound of crickets was conspicuous in its loudness.
I wondered, if it is like this here how should it be where there is no Sun and no stars. Does such a place exist?
In space, there may be light sources providing light across their path. So, there is this competition between light and darkness there too. Is there some place where even stars or other luminous objects don't exist? 
Perhaps it is all irrelevant for earthly beings as they would never reach a place beyond galaxies.
What it would feel to be there would be simply a conjecture. Food for thought for an idle mind or for an extremely curious one.
While considering these things, I unknowingly drifted into philosophical thought, which was unintended. The memory of that evening spurred me into writing the poem on darkness. 
 Writing about darkness:
I have recently posted a poem about darkness in 3parts. I think it would in order to clarify why I wrote that.
One fine evening, we had started our journey on a road with sparse traffic. Slowly the evening light faded and the sky had a thin covering of clouds. 
It had got progressively darker and darker with only the head lights showing the road ahead. 
I observed the hills and the trees and the fields getting gradually consumed by the darkness. It was overwhelming in its power and my mind raced with thoughts about the perpetual struggle of light against darkness. This darkness in the wilderness dulls your sense of sight but enhances the sense of sound. When the vehicle stopped at a place, the sound of crickets was conspicuous in its loudness.
I wondered, if it is like this here how should it be where there is no Sun and no stars. Does such a place exist?
In space, there may be light sources providing light across their path. So, there is this competition between light and darkness there too. Is there some place where even stars or other luminous objects don't exist? 
Perhaps it is all irrelevant for earthly beings as they would never reach a place beyond galaxies.
What it would feel to be there would be simply a conjecture. Food for thought for an idle mind or for an extremely curious one.
While considering these things, I unknowingly drifted into philosophical thought, which was unintended. The memory of that evening spurred me into writing the poem on darkness. 
@@@@@&&&&

బుద్బుదమైనా అద్భుతమే
సృష్టిని ప్రతిదీ చిత్రమ్మే
చిన్నబుచ్చకు చీమనైనా
అణువున దాగును బ్రహ్మాండం!

---------(---------)----------
 విశ్రాంత జీవితం:

ఆ.వె:
బాసు లేడు నేడు భగవంతుడే తప్ప
చింత లన్ని నేడు చేరె గతము
పెన్షనొకటె తప్ప పేరాస లేదుగా.
వింత సుఖము గూడు వృద్ధులవగ.
###₹₹₹###
Just for fun: ఆ.వె:
ఒక్క కోకిల రవముర్రూత లూగించు
వంద విన్న ఫలము వంద రెట్లు. 
విన్న వారికగును విన్నంత ఫలితము
వినని నరుడు జూడ వెఱ్ఱి వాడు. 
@@@@@@
Some poems of KaLidasa
Translated from Shakuntalam:

శకుంతల:
@ అభిముఖేమయి సంహృతమీక్షితం
హసితమన్య నిమిత్త కృతోదయమ్!
వినయ వారిత వృత్తిరతస్తయా
నవివృతోమదనో నచ సంవృతః!

*ఎదురై నిల్చె చూపు మరల్చె
ఎందుకోనన్నటుల-
 దరహాసమొలికించె,
సిగ్గు నిలువరించు చుండ,
వలెననదు వలపు తలపు
  వలదు తగదనదు వలపు

@: మానుషీషు కథంవా స్యాదస్య రూపస్య సంభవః
నప్రభాతరలం జ్యోతిరుదేతి వసుధా తలాత్

*మనసు నమ్మజాలదీ తరుణి
మనుజులందు జన్మించెనన్న,
మించు జన్మించునా పుడమిపై
మింటిపై బుట్టియిల జేరుగాని. 

@ అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై-
రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదిత రసం!
అఖండం పుణ్యానాం ఫలమివచ తద్రూప మనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః.
*వాసన జూడని పువ్విది
గోరుగిల్లని చివురుటాకిది
కోతబడని రత్నమిది
ఎవరును రుచిజూడని
జుంటి తేనియ పగిది
తరగని లావణ్యమెంతొ పుణ్యఫలము
ఎవరికి దక్కు ఫలమో
చివరికిది, విధికె తెలియులే అది.

లఘు కవిత:
మనసుకు మందు:
అంతరంగము నందు - అంకురమ్మును జెందు
వింత భావములెన్నొ - వెలువరించుట యందు
ఎంత ఆనందమో - ఎడద తేలిక నొందు
చెంత లోననె యుండు -చింత లన్నిటి మందు!


13.ప్రాణి పుట్టుక:

ఎచటనుండి వచ్చినది ఏమిటది చిత్రమై
ఇచటనే గన్పించె -ఇలను అది చిత్రమై

సృష్టిలోజరిగినది చిత్రమగు సంఘటన
అష్టగ్రహములలోన నాస్తి అది చిత్రమై


జన్మించెనందురది జలములో తొలుతగా
చిన్మయమ్మగు లీల సృష్టి నది చిత్రమై

ఒకకణము జన్మమ్ము నొందినది తొలుతగా
ఒక కణమె జీవిగా ఉండెనది చిత్రమై

ఒక కణమె పెక్కులై ఉద్భవించె నిలలో
సకల జీవుల సృష్టి జరిగెనది చిత్రమై

జగమంత జీవులై సంచరించెను నేడు
భగవాను లీలలో భవ్యమది చిత్రమై!






 14. గాలి వాటం:

విరివిగా వీచినవి విద్వేష పవనములు
అరుదుగా గన్పించె ఆదరణ సమయములు;

కంటకమ్ముల వనము కారాదు నీమనము
మంటలెగదోయుచూ మనలేవు అనుదినము;

ద్వేషించు హృదయములు విషముతోడనె నిండు
ఘోషించు వచనములు ఘోరమగుచూ నుండు;

నీద్వేషమే నిన్ను నిలువెల్ల దహియించు
ఉద్వేగమే నీకు ఊరటను తొలగించు;

కరుణ పేరును జెప్పి కడకు కత్తిని దూసి
కరకుదనమును జూపి కాకు రక్త పిపాసి!
@@@@@

15.జీవోద్భవ ‌వైచిత్రి:

జగాన సృష్టియన్నది తలంపనెంత వింతయో
అగాధమైనదా విధం బనాదిదెంత వింతయో!

అసాధ్యమైనదా విధంబదెట్లు సంభవించెనో
విశాలమైన ఈజగంబు నందదెంత వింతయో!

ఒకేకణం బదెట్లుగా జగాన జన్మ నొందెనో
ఒకే కణంబనేకమై చరించుటెంత వింతయో!

కణాలు కొన్ని గూడుచూ గణాలుగా తరించెనే
గణాలు సూక్ష్మ జీవులై చలించుటెంత వింతయో!

అనంత విశ్వమంతటా ఇదెచ్చటా నెరుంగమే
ధరాతలంబు నందునే జనించుటెంత వింతయో!

సముద్ర జీవులెన్నియో ఘనంబులై గమించెనే
తిమింగలమ్ములై యవే చరించుటెంత వింతయో!

మహీజమై జనించుచూ మరింత వ్యాప్తి నొందెనే
మహా ఘనమ్ములై మహీతలాన నెంత వింతయో!

సరీసృపమ్ములై చతుష్పదమ్ములై చరించుచూ
మరింత వ్యాప్తి జెందుచూ వర్ధిల్లుటెంత వింతయో!


@@@@@@@#@##@@##@#@@@@@##


గజల్, రాగిణి ఛందము:
భ,మ భ,మ. U I I U U U U I I U U U.

ఏవిధి కొల్చేనో నిన్నిపు డే

@@@@@@@@@@@@#

16.వేదోద్భవమ్:

అనాది యైన దేశమే అనంతమైన దేశమే
పునాదులైన సంస్కృతుల్ ప్రవృద్ధమైన దేశమే!

సరస్వతీ కృపన్ మహాద్భుతాల సాహితీ లతల్
సరస్వతీ దరిన్ జనింప ధన్యమైన దేశమే!

అపూర్వమైన వేదమే తరించి పోవగా జనుల్
సుదీర్ఘమై సుశ్రావ్యమై పునీతమైన దేశమే!

వచింపగా విరించియే రచించిరే మహాఋషుల్
పఠించి పాడగా మునుల్ పవిత్రమైన దేశమే!

అనేకమౌ స్తుతుల్ పఠించి శక్తులన్ భజింపగా
అవే పదమ్ములై ధ్వనించి వేదమైన దేశమే!

ప్రజోపయుక్తమై నిరంతరమ్ము నాచరించగా
ప్రయోగ కర్మ కాండలే సువేదమైన దేశమే!

సరస్వతీ కృపా ఫలం సరాగ మాలికా గణం
సృజించ సామవేదమే శివమ్ములైన దేశమే!

పఠించు మంత్ర తంత్ర సిద్ధులెల్ల కూర్పు జేయగా
అదే అధర్వమై చతుర్థ వేదమైన దేశమే
@@@@@@@@@@@@@@@@
ఏరామదాసనిన ఎల్లరెరిగిన వాడె
నా రాముడే ఎపుడు ననుగాచు ననువాడె.

@@@@@@@@@@@@11@1@@@

17.మధురోహ కలిగెనా మందగమనా నీకు
అధరముల దిరినవా హంసగమనా నీకు
ముదితలకిది సహజమె మురిపెమును కాదనకు
విధిలీల తెలిసెనా విమలవదనా నీకు
మృదువైన మానసము మిడిసిపడె నేలనో
కుదురేల కరువాయె కుందనమ్మా నీకు
విరులేల బరువయ్యె విరహమేలా కలిగె
చిరుకోప మేలనో చిన్నదానా నీకు
నిను వాడు మరచెనని నిందించు చుంటివా 
 చిన వాడు రాకున్న చింతమదిలో నీకు

అదెకానవచ్చెనా అంతనే చెలికాడు
మధన పడుటను మాని మది మురిసెనానీకు!


#########
శివుడి ముఖము నుండి వెలువడె నట ఓంకారము
భూత భవిష్య వర్తమానముల నిల్చయండన ని ఒంగారమే అక్షరమ ట సకల శబ్దముల మూలనట
ప్రకంపన ప్రణవ నాదము
18.సరస్వతీ నాగరికత:
(వేదోద్భవమ్ నకు కొనసాగింపు)
ద్వి.గ:
ఇల లోన ప్రథమమ్ము ఋగ్వేద గ్రంధమే
తుల తూగదింకేది తొట్ట తొలి పొత్తమే;

వేదఘోషలు మ్రోగె విమల గాంభీర్యముగ
శోధనల ఫలితమ్ము సుందరము సులభముగ;
'రేయి పగలగు చుండు రీతిగా ప్రతిదినము 
మాయవలె తోచునా మర్మమేమియొ గనము;

ప్రభవమొందుటదేల ప్రాగ్దిశన భాస్కరుడు
ప్రభవమ్ము గోల్పోయి పడమట మునుగు చుండు;

మెరుపుతో ఉరుమేల, మిరుమిట్లు గగనమున
ఎఱిగి తీరవలె'నని ఎడతెగని తపన;

తారలెటులొచ్చునో తళుకు తళుకు మనుచును
చేరి గగనమునందు చిన్నిదీపములగును;

ఆదిలోనార్యుడు అచ్చెరువు తోడగని
మేధతో శోధించె మేదిని నంతటిని;

తెరచుకొనెను తలుపులు తెలిసినవి మర్మములు
పరగె మదిలో తనకు పలు సృష్టి ధర్మములు;

చెలరేగె సంస్కృతులు చింతనామృత ఫలమై
ఇలనుండి దివికేసి ఎగబారు చందమై;

ఉచ్చమైనది బ్రతుకు ఉనికి పరిపూర్ణమై
హెచ్చె బ్రతుకుకు విలువ హితమై హిరణ్యమై;

అలరారె జీవితము ఆనదీ తీరమున
కలలాగ గడచినది కర్పూర చందమున;

అంతలో విధిలీల నాగిపోయెను జోరు
అంతనదిలో గూడ అడుగంటినది నీరు!

(తదుపరి: గంగా మైదానమునకు ఆర్యుల ప్రస్థానం).
మెరుపుతో ఉరుముటయు మిరుమిట్లు గగనమున
మెరిసి ఉరుముటదేల

ప్రపంచ నదులలోనే పెద్దదైన సరస్వతి నది, హిమపర్వత శిఖరము అడ్డుగా కూలి పోవుట వలన ఎండి పోవడం, తత్ఫలితంగా గంగా మైదానమునకు ఆర్యుల ప్రస్థానం:

19.ద్వి.గ:

నదులకెల్లను గొప్ప నది సరస్వతి తానె
అదియేమి చిత్రమో అసలు పారుట మానె!

నగము విరిగి పడినది, నది ఆగి పోయినది 
ఎగసి పడు హిమనదము యింకిపో సాగినది!

ప్రజల జీవనమచట ప్రశ్నార్థకమ్మయ్యె
సుజల జీవన ధార శుష్కించి మరుగయ్యె!

మార్పు కావలెననుచు మనుగడ కొరకు వారు
తూర్పు దిశగా నపుడు దూరమ్ము చనినారు!

ఆనందమొందించు అద్భుతము గనిరచట
పానార్హమగు నీరు పారె పుష్కలమచట!

అచటి నేలలజూడ నతి హర్షమనిపించె
ఎచట జూచిన నీరె యిదె స్వర్గమనిపించె!

సారవంతమునేల సాగుచేయగ పండె
కోరినంతఫలము, కుడువ గడుపులు నిండె!

ఇంత జేసిన వారు ఏమారగా లేదు
చింతనా మృతమును చెదరనీయగ లేదు!

అన్నినదులందునను ఆనంద దాయకము
మిన్నయైనది గంగ మేటియందలి జలము!

గంగనే మాతగా గౌరవించిరి వారు
గంగనే దేవతగ గౌరవించిరి వారు!

Continuing with the Aryan journey:
సరస్వతీ తీరము నుండి వచ్చి, గంగా మైదానంలో ఆర్య నాగరికత వృద్ధి:
20.ఇతి హాస యుగము:

ద్వి.గ:
వేదములు హృదయముల విడువరైరెప్పుడును
వేదభూమినచటికి విస్తరించి నటులను;

గంగలో మునుగంగ గరళమైనను తొలగ
అంగాంగ మానంద మనుభవము చెందంగ;

భూమాతనే నమ్మి పొలములను దున్నుచును
గోమాతలను గొలిచి కొరత లేకుండగను;

వ్యవసాయ మొనరించి పంటలను పండించి
జవసత్త్వములతోడ జనవృద్ధి సాధించి;

ఆహార భద్రతను అనుభవించిరి వారు
సాహసమ్ములు జేసి సంపన్నులైనారు;

జనపదము లేర్పడెను జనసంఖ్య పెరగంగ
జననమొందెను ప్రభుత జనుల పాలింపంగ;

సంపన్నమైవిరిసె సంస్కృతీ లతలెన్నొ
పెంపొందె సాహితీ ప్రేరణల గతులెన్నొ;

రెక్కలొచ్చిన ఊహ లెగసె స్వర్గపు దారి
ఎక్క జూచుటె గొప్ప ఎంతొ వింతను గోరి;

రసరమ్య కావ్యమ్ము రామాయణమ్మైన
అసమాన భారతము రాజకీయమ్మైన;

ధర్మమును పాటించి ధరణిపై జీవించు-
మర్మమును గుర్తించి మనుగడను చర్చించు
పౌరాణికములతో పండె సాహిత్యమ్ము
పారాయణములతో బ్రదుకుల పరవశమ్ము;

వివిధ దశలందునను విధి విధానము గూర్చి
వివరమగు రీతిలో విషయముల చర్చించి
నిత్య శోధన తోడ నియతిపై యోచనలు
సత్యమార్గము గూర్చి సరియైన సూచనలు;

వెలువరించిరి వారు వివిధ రీతులలోను
తెలుప జూచిరి వారు తేటతెల్లము గాను!

#@@###@@

ద్వి.గ:
21.ఆకాశమంతటా అరుదైన చిత్రములు
సాకార మగుచుండె చక్కనగు దృశ్యములు

ఎండ ప్రొద్దున నేడు ఎంత హొయలొలికేను
వెండిరథములు కదలి వెడలి నెమ్మదిగాను

అల్లనల్లన సాగె అడ్డుకొని దినకరుని
పిల్లగాలికి కదలి పెండ్లినడక వలె జని

ఆడుచూ దోబూచు లాటలను రవితోడ
నీడలకు ఎండతో నేలపైనను క్రీడ! 

@@@@@@@
ఆకలమ్మా యనెను బాలుడగునొకండు,
అదియె యువకవి పుంగవుండనియె నిటుల:
"జఠరరసమూరు చుండెను జనని నాకు-
శూన్యమగునా యుదరమందు, చూపు కరుణ"! 

@###@@@@&&

@ The Great Hindu fashionable Secularists
 
అయ్యలారా, అమ్మలారా!

మీకేమి గావలెనొ మీరెరుగరైతిరే
మీరు చేయునదేమొ మీరెరుగరైతిరే!

అలలెగసి పడుచుండ అడ్డుకొన  జూతురే
అడుగడుగునా మీరు ఆటంక పరతురే!

చెలరేగు చుండినది చేయు ప్రక్షాళణము
విరుచుకు పడుచుండె విర్రవీగకు క్షణము!

మీరు తోడై పోగ మేలుమీకె జరుగు !
 రాజేసిన దెవరీ  రక్త పిశాచిని
కుల దూషణలతో కుచ్చితమ్మె పెరుగు!
-----------

@22. ఎంపిక: (అనియతము)
గొప్పకాదని అనను గులాబి పూవులను
గర్హించ వద్దందు గన్నేరు పూవులను!

కోయిలమ్మను జూడు గూడు దొంగిలించు
జ్ఞానమెరిగిన కాకి జగమెల్ల దిరుగు!

కోయిల పాట తెలుపు కొత్త ఋతువు రాక
కాకి మాటలాడు కాల నియమము లేక!
---------

23.కవితా దినోత్సవం సందర్భంగా:
(As usual, criticism is welcome for this poem too)
Yesterday, today and tomorrow are not separate from each other. Time is not divisible except for our calculations and convenience. In reality time is unity, indivisible!
#  కాలవిభజన కృత్రిమమైనది. సౌకర్యార్థం  దినాలు, నెలలు, ఏళ్ళుగా విభజించుకుంటాము కానీ, కాలమనేది అవిభాజ్యం! 
మనసులో ప్రేమ  ఉండటమే పగలు. లోపించటమే రాత్రి:

@ఒకటే దినం: (ఛం: అనియతము)

వేయి కలల రేయి, 
వేయి కనుల సోయి,
హృదయమొకటే నోయి!

పగటి వెలుగుల ప్రకాశమంతా 
అంతమయ్యెడి రవితో
అంతమైపోదా!

పగలైన, రేయైన
ఋతువు లెన్నైనా
కృత్రిమమె విభజనము
కృత్రిమమె కాలమానమ్ము
బ్రదుకు కొకటే దినము!

వేయి కన్నుల మనసు
మనసు కొక్కటె దినము
బ్రదుకు వెలుగంతా
ప్రేమలోపించ
అంతమై పోదా!

భావించ లేకున్న 
తూర్పుకిడు దండమ్ము!
భావమెరుగ లేకున్న
భక్తి భావమె మిన్న!

@24. నిశ్శబ్దం 

మనసులోని రణగొణలు
మసలు చుండు యోచనలు
అనుకొనని క్షణమున 
ఆగి పోవుచుండు!

ఆవరించునేదొ
నిశ్శబ్దమపుడు
అందరానిదా అనుభూతి!
తలచి పొంద లేనిదా శాంతి!

జగమెల్ల కనిపించు నపుడు
నిత్య నూతనముగా 
క్షణమైననూ ఆ అనుభూతి
చకితులై పోదుము!
ధన్యులై పోదుము!
--------

 
-----------&&-------


@25. రాను రానూ:
నడిచే ప్రతి మనిషీ ఒక యంత్రం 
గడిచే ప్రతి క్షణమూ గతకాలం!

మనిషి లోపల మనిషి 
కలడో లేడో సందేహం!

మస్తిష్కం నించి జనించిన
మస్తిష్కాన్నే జయించిన
సంకేతాల సమాహారం సాంకేతికం.
ఆ సంకేతాలకె బానిస మానవ మస్తిష్కం !

నీ పుట్టు పూర్వోత్తరాలు 
నీ పుట్టింటి ఆనవాళ్ళు
కార్పొరేట్ నిఘానేత్రాలకు 
కారు చవకగ చిక్కిన చిరుతిళ్ళు!

లోలోతుల నిదురించే 
సృజనాత్మకకు సంకెళ్ళు!

------+------+------



@ 26.ఎంపిక: (అనియతము)

ఎవరి గొప్పలు వారివి
ఎవరి తప్పులు వారివి!

గొప్పకాదని అనను గులాబి పూవులను
గర్హించ వద్దందు గన్నేరు పూవులను!

జ్ఞానమెరిగిన కాకి జగమెల్ల దిరుగ
కోయిలమ్మ జూసి గూడు దొంగిలించు!

కోయిల పాట తెలుపు కొత్త ఋతువు రాక
కాకి మాటలాడు కాల నియమము లేక!

ఎవరి గొప్పలు వారివి
ఎవరి తిప్పలు వారివి!
ఎవరి తప్పులు వారివి!

పూవుతో భ్రమరము పూసుకొని తిరుగు
అవసరముతో ప్రేమ అంకురము జరుగు!

అందరాని పండు ఆధ్యాత్మికమ్ము
అందుకొనిన వారు ఆరాధ్యనీయులే,
అటుగాని వారును ఆనందమెరుగరె?

ఎవరి గొప్పలు వారివి
ఎవరి తిప్పలు వారివి!
-----+-----+------+

Just for fun:

వచనాను వాదములు రచనాను కూలములు
 పచనమ్ముగాని పచ్చికూరల వలెను.
వండుకొనుట యను పనియుండ దసలు;
పాటరూపమున పాయసమ్మగును.


అనువాదమేల?

కవితలన మనోహర భావములు
కదిలించు హృదయ సీమలను
ఎవరి నోట పలికినను ఆ మధురిమలు
పంచ వలెనవి పదిమంది లోను.

నేడు వినిపించని రాగం: (ఛం:అనియతం)

వింత శబ్దమొకటి వీధిలో వినిపించె
వీనులకది యెంతొ వేరుగా ధ్వనించె
గొంతెత్తి తానేడ్చె గువ్వ వంటి చిరు ప్రాణి
ఎంత సంబరమది ఎల్లలెరుగనిది
ప్రకటించె తనరాక ప్రపంచమంతటికి
పసిపాప ఏడుపే ప్రప్రథమ సంగీతం!
అరుదైన వీనాడు ఆరాగ మాధురులు.


No comments: