నరకుని జంపిన మగువకు
సరకే యెన్నగ పలువురు సవతులు, వారే
తరుణికి బలగమగుదురని
పరవాలేదను కొనినది పసిగట్టినదై.
ఆ.వె:
విధివ శాత్తు వారు వేరు పడిరి
తప్పి పోయి, తమ తప్పు గాదు
వృధ్ధ నారి వగచె విపరీత మగురీతి
ముదిని గనగ సఖికి ముదము గలిగె
తనదు ప్రియుని గనక తమకము తోడను
బాధ పడుచు నుండె బాల చాల
ప్రియుడ వచ్చు వేళ వెలుగుల జిమ్ముకౌ
ముదిని గనగ సఖికి ముదము గలిగె
నేనొక్కడుత్తముడ నిక తదితరులు గారు
మానవత నాకెరుక మనుషులెవ్వరు లేరు
ఇలలోన భూమాత కేదిదిక్కనుచు నెవరు
కలలుగను చుందురు కల్లమాటలు జోరు!
ఎందరెందరొ ఘనులు ఎనలేని త్యాగములు
ముందు వారెందరొ
వందనీయులగు వారు వారి త్యాగ ఫలములు
అనుభవించుచు మనము- అటువంటి వారలను
అను నిత్యము ను దూలి - అఋనరాని మాటలను
మాటలే యీటెలుగ - మాటిమాటికి ఘనుల
కోటి కోతలతోడ - కొండాడుటది యేల
అనుభూతిని పంచడంలో అసమానుడైన కవి ఖలీల్ జిబ్రాన్. ఆయన అరబిక్ లో వ్రాసిన కవిత ఆంగ్లాను వాదం చదవడమే అద్భుతమైన అనుభవం.
ఆంగ్లంలో ఇది వచనంలో వుంది. దీన్ని మంజరీ ద్విపదలో అనువదించే ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ భావాన్ని అందించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. చాలా కాలం పడుతుంది. అయినా ధైర్యం తచ్చుకుని ప్రారంభించాను. మిత్రులకు నచ్చితే కొన సాగుతుంది. కొన సాగితే ఎపుడో ఒకరోజు పుస్తక రూపం దాల్చుతుంది.
ప్రతి ఛాప్టరు రెండు భాగాలలో వ్రాస్తాను.
షరా మామూలే. స్వేచ్ఛానువాదం చేస్తూ, ఊళ్ళూ, పేర్లు మార్చి వేశాను.
The Prophet:
ప్రవక్త:
నౌకాగమనం: (1)
ఆనందుడను యోగి అమల మానసుడు
పరమేశుని కృపకు పాత్రుడే అతడు
సకల జన హితుడు సాధువు తాను
లోక సంచారియై లోక ప్రియుండు
లంగరేయగ నావ లంకలో దిగెను.
గడపెను పుష్కర కాలమచ్చటనె.
ఎదురు చూసెను తాను ఏండ్లు పన్నెండు
తిరుగు యానము జేయు తెరువేది యనుచు
ఒకనాటి సాయంత్రి ఓషధి గాంచ
గిరిపైని కెక్కితాను క్రిందికి జూడ
ఒకసారె హర్షించె ఉల్లము తనకు
అల్లంత దూరాన అలల చాటుగను
తెల్లంగ పొడసూపె తెరచాప ఒకటి
అది చూచి యోగికి ఆనంద మొదవె
మదిలోన కురిసెను మల్లెల వాన!
దిగుచున్న యోగికి దిగులయ్యె మనసు
గగనాన మబ్బులు గప్పి వేసినవి.
ఎటుల పోగలనునే నెల్లర వీడి
గాయ పడదె మది గాఢమ్ము గాను.
ఎంత వేదన నేను ఇచట పొందితిని
ఏకాంతమందు నే నెటుల గుందితిని
ఈ ఊరి తో నాకు ఎంత బంధమ్ము
మధురమీ వేదన మరిచి పోగలనె!
నా ఆత్మ శకలాలు నగరి నెల్లెడల
విస్తరించెను నేడు విడచుటే లాగు!
నా ఆర్తి శిశువులై నడయాడు చుండె
నగ్నముగ యిచటి నగముల పైన!
వదలిపోవుట యెట్లు బాధ లేకుండ!
మదినంత కలచును మధురజ్ఞాపకము!
వలువ వొలిచినట్లు వదలలే నిదిది
వొలిచినట్లుండును వొంటిపై తోలు!
వీడి పోవుట కొట్టి విషయము గాదు
మధుర వేదన తోటి మానసమ్మయ్యె!
ఎంతబాధించినా యిక ఆగ బోను.
కడలి యానము నింక కాదన లేను!
అలల బాహువులతో అఖిల లోకమును
పిలుచు సాగరము పిలిచెను నన్ను!
ఆగి పోవుటనిన నాపివేయుటయె
సాగిపోనీకుండ చైతన్య రథము!
ఇచటి లోకమునంత ఎటుల నావెంట
కూడగట్టు కొనుచు - కొనిపోవ నగును?
ప్రవక్త ( contd)
తిరుగు యానము గూర్చి యోగి చింతన కు
కొన సాగింపు: (ముందు భాగంలో యోగి అనుకుంటున్నాడు:
ఇచటి లోకమునంత ఎటుల నావెంట
కూడగట్టు కొనుచు - కొనిపోవ నగును?)
నౌకాగమనం -2
ధ్వని గళమును వీడి -తనతోడ వెడల
చేకొన గల్గునె - జిహ్వాధరముల!
గగనాన ఒంటరై గమనమౌ డేగ
ఎత్తుకొనుచు గూడు ఎగురునే తాను!
యోగి కొండ దిగుచు యోచించె నిటుల
సారించె దృష్టిని సంద్రము వైపు.
దరి జేరు చుండెను తన దేశ నావ
సరిపోల్చె మనుజుల సరివారు గాను.
తనువెల్ల పులకించె తనవారి గాంచి
కనుల కళింగమే కనిపించె తనకు.
'నాదేశ వాసులౌ నావికులార
పరమేశుడే మిమ్ము పంపెనా ఏమి?
కలల కడలి లోన కనుచుందు మిమ్ము
కనులార గాంచుట కలకన్న మిన్న!
పయనించగ మనసు పరుగులు పెట్టె
అయ్యలారా నేను అనుసరించెదను!
చివరగా ఒకసారి చేరుదెల్లరను
భాషింతు నొకపరి పదిమంది తోడ!
శ్వాసింతు నొకమారు సాధువీ గాలి!
మీలోన నొకడై మిము జేరనిండు
నావికుల నడుమ నావికుడగుచు!
వాగైన నదియైన వార్ధినే జేరు
కడలి తల్లీ నీవె కడకౌదు శరణు
నీయందె బిందువై నిను జేరనిమ్ము
ఆవలించెడి తల్లి అంతేది నీకు!
ఈ బిందువును గూడ ఈజల నిధిని
చేరనీయుము నన్ను చేరివచ్చెదను'
నౌకాగమనం 3
వీడుకోలు:
ఓడ గాంచి రపుడు ఊరి వారచట
ఓడనెక్క దలచు యోగిని గనిరి
చేపలమ్మెడి వారు చేల కర్షకులు
తాడినెక్కెడి వారు తాపి మేస్త్రీలు
బయట పనుల జేయు పనివారు జూచి
రయమున బిలచిరి రండు రండనుచు
ఒకరి నొకరు బిల్వ ఊరంత గూడె
చకితులై జూచిరి సంద్రమ్ము వైపు
"మరల వచ్చెను నావ, మననెల్ల వీడి
తరలి పోగలడిక తన వూరు జేర"
తన పేరె వారంత తపనతో పిలువ
వినిన సాధువు మది వికలమై పోయె
' కూడి ముచ్చట లాడ కుదిరెనా నేడు
వీడ్కోలు దినమున వేడుక యగునె!
ఓడ వచ్చిన సంధ్య ఉషోదయమ్మె?
తప్పదీ వేదన తనవారి వీడ!
'చిగురుటాకై మది చెదరెను నాకె
వగతు రంద రెటుల వారి నోదార్తు!
నా వాంఛలే పొంగి నదులై పారి
దాహార్తి దీర్చునే తప్త జిహ్వలకు!
'వదలి వేసి పనుల వచ్చి రందరును
కదలి, వూరు వదలి కడలిలా వెడలి!
'ఫల భరిత వృక్షము వలె పంచగలనె,
హృదయమందున గల ప్రేమ నంతటిని?'
పలుకనా వేణువై పరమాత్మ కేల
గళములో తన శ్వాస గానమై సాగ!
మౌనినై ధ్యానించు మనిషినౌ నేను
ఏనిధి పంచుదు ఏకానుకిత్తు!
ఏనాడు నాటితి నెచ్చటెచ్చటను
ఈనాడు నాకిది ఏమి ఈఫలము!
చూపింతు చెయ్యెత్తి శూన్య దీపమును
వెలిగించు పరమాత్మ వెన్నెల నింపి!
తలుచుకొను చుండె తనలోనె తాను
తలపులెన్నొ మిగిలె తానెరుగనివె!
(తదుపరి: పుర జనులతో సంభాషణలు)
ప్రవక్త :
నౌకాగమనం 4 (తొలి అధ్యాయంలో చివరి భాగం)
సాధువు వీడ్కోలు సందర్భమున పుర జనులతో సంభాషణ:
జనుల వద్దకు పోయె జనప్రియ మౌని
జనులెల్ల వగచిరి స్వామిని గాంచి ;
పుర ప్రముఖులు:
పుర ప్రముఖులనిరి, పోబోకు స్వామి-
మరలి పురము నుండి, మము వీడ బోకు!
అంధ కారము నందు అణగు మాబ్రదుకు
చక్క దిద్దితివయ్య సంస్కరించితివి!
చందమామవు నీవు చల్లగా వెలుగ
చక్కనౌ నీ మోము సంతసమ్మొసగు!
పరమ సాధువు నీవు పరదేశి గావు
వర పుత్రుడవు నీవు వదల లేమయ్య!
వయసు మీరిన మాకు పండించినావు
మధ్యాహ్న కెరటమై మధుర స్వప్నముల!
పురోహితులు:
పురములో నుండెడి పూజారులెల్ల
అడుగు ముందుకు వేసి అతడితో అనిరి!
అలలు మనకు మధ్య అడ్డు కానీకు
మధుర క్షణములను మరుగు కానీకు!
నీజాడ మాలోన నిలిపెను స్ఫూర్తి
నీనీడయే మాకు నిజముగా వెలుగు!
నీ మీద మా ప్రేమ నిశ్శబ్ద గీతి
మామనస్సులలోనె మౌనమై దాగె!
గళము చీల్చుకు వచ్చె గట్టిగా యిపుడు
నీ ముందు నిలచెను నిజరూపు తోడ!
తరచి చూడదు ప్రేమ తనలోతు తానె
విరహ సమయమున వెల్లడి యగును!
జనులందరొకటైరి - చనబోకు మనుచు
సాధుపుంగవుజేరి - చరణాల బడిరి!
తలవంచు కొనినాడు తప్త మానసుడు
ఒలికె కనుల నీరు ఉల్లము పైన!
వెంట జనులు రాగ వెడలెను స్వామి
గుడిముందు బయలులో గుమి గూడినారు!
మందిరమును వీడి మైత్రేయి వచ్చె
చాల సాత్వికురాలు సాధ్వి ఆవనిత!
ముందుగా గుర్తించి ముని గొప్పదనము
ఆదరించిన దామె ఆస్వామి నెపుడు!
మైత్రేయి గన్పించ మనసు ద్రవించె
ఆర్ద్రమౌ గొంతుతో అనెతానె సాధ్వి!
"పరమాత్మ దూతవౌ - పరమ పావనుడ!
ఎంత కాలమొ నీవు ఎదురు చూసితివి.
"తిరిగి పోవుటకింక తీరమ్ము పిలిచె
తిరిగి వెడలు నావ తీరాన నిలిచె!
నీదేశ మిప్పుడు నిను బిల్చుచుండె
గాఢమగు నీ వాంఛ కాదనగలమె!
మనసు లోతుల నీవు మరులు గొన్నావు
మరలనీ దేశమ్ము మరలి పోవయ్య!
చింత వీడి చనుము -చిన్న కోరికను
అంతమందున దీర్చి ఆశీర్వదించు
శుద్ధ జీవితమును సూచించి పొమ్ము
విడి పోవు సమయాన వివరించి పొమ్ము!
నీవు చేసెడి బోధ నిలచి పోగలదు
తరతరములనిది ధారయై జేరు
పగలైన రేయైన పరికించు నీవు,
ఏకాకి వగు నీవు ఎరుగనిదేమి!
మాజీవితమ్ముల మర్మమ్ము నీకుౠ
కరతలామలకమె కరుణించు మమ్ము!"
అని పల్కె మైత్రేయి ఆసాధు తోడ
అపుడు సాధువు వారి నడిగె తానిట్లు:
" మీ హృదయములనే మెదలు సత్యమును
వేరెట్లు తెలుపుదు వివరించి మీకు"?
తదుపరి సంభాషణ: ప్రేమ తత్వము ను గూర్చి.
ప్రేమ తత్వం:
'ప్రేమ తత్వము గూర్చి - ప్రియమార జెపుము'
అని అడిగె నపుడు - ఆమె సాధువును.
"పిలువగా నిను ప్రేమ వెడలిపో వెంట,
కఠినమై ఆదారి కన్పించ గలదు.
"పొదవి కొనును నిన్ను పులుగు లాగుననె,
ఱెక్క గ్రుచ్చుకొనిన లెక్కించ వలదు.
విశ్వసించుము నీవు ప్రేమ భాషణను,
మధుర స్వరముతోటి మనసు లాలించు
సుడిగాలి వలెనె శోధించు నిన్ను,
చెదర గొట్టు భ్రమల చేదు మందగుచు.
మది పొంగ జేయును, మరి శిక్ష వేయు,
పెంపు జేయు నిను, పిదప తగ్గించు.
నీహృదయ లతను నిమురు ప్రేమగను
లలిత పల్లవముల లాలించు నటుల.
ప్రేమయే గదలించు వేరుమూలముల
చెదరగొట్టు భ్రమలను చేరి లోతులను.
పోగైన ధాన్యము పొలముల లోన
తొలగించ రాళ్ళను తూర్పార బట్టి,
పొడిజేసి తడుపుచు పొయ్యిపై బెట్టి
నిప్పుపై కాల్తురు, నిను గూడ ప్రేమ
ప్రక్షాళనము జేసి పరమాత్మ కేల
చేర్చు, ప్రసాదమ్ము చేయుచు కడకు!
అహము నణగ జేయు ఆనందమొసగు
విర్రవీగుట మాన్పు వినయమ్ము నొసగు.
మనసు మర్మము లన్ని మనిషికే ఎరుక-
గావించు ప్రేమయే, కాచు తానిన్ను.
ప్రేమలో శాంతినే ప్రేమ మాధురినె
కాంక్షించి నట్లైన కరువింక ప్రేమ.
అగ్ని పరీక్షకు నీవు అర్హుడు గావు
దాపరికపు చాటు తగునులే నీకు.
పూర్ణ సంతసమును పొందలే వింక
బాధ నెరుగ లేవు పరి పూర్ణ రీతి!
ప్రేమ ప్రేమ నొసగు వేరేమి వలయు
ప్రేమ కోరదు నిన్ను వేడదేమియును!
పరిపూర్ణ మైనది పరిశుద్ధ ప్రేమ
అది స్వయంపూరక మవిభాజ్యమగును!
నీలోన దైవము నిలిచినాడనకు
దైవాంశలో నేను దాగితి ననుము!
మదిప్రేమ మయమైన మరియేల వాంఛ,
వాంఛయుండ వలెనా? వాంఛించు మిటుల-
"సెలయేటి పాటయై చిరుగాలి జేర,
సుతిమెత్తనై మది సొదగుంది పోగ,
"ఆబాధయే నీకు ఆనంద మొసగ,
తెల్లవారగ మేను తేలిపోవగను--
"మది ప్రేమ నిండగ మరియొక్క దినము
ధన్యుడైతిననుచు తనివి తీరగను
"ముదముతో ప్రార్థించి మూడు పూటలను
నిర్మల ప్రేమతో నిదురించ వలెను"!
ప్రేమ తత్వం తెలిపిన ఆనంద యోగిని సాధ్వి మైత్రేయి దాంపత్యమును గూర్చి వివరించ గోరింది.
యోగి ప్రవచనం చాలా తాత్వికంగానే కాక చాలా Radical గా కూడా వుంటుంది. అది చాలా మంది ఆధునికులకు కూడా ఒక ఛాలెంజ్! దంపతులు ఎవరి వ్యక్తిత్వం వారు కాపాడు కోవాలని ఉద్బోధిస్తాడు. చదవండి:
దాంపత్యం:
మైత్రేయి అడిగెను మరియొక్క సారి :
'దాంపత్యమును గూర్చి తర్కించి చెపుము.
'ఆలు మగల మధ్య అనుబంధమనిన
అదివుండ దగునెట్లు? ఆవిధమ్మేమి'?
" పుట్టి నపుడు గాని, పుడమి జేరినను
బట్టగట్టి తిరిగి, బ్రదికి నప్పుడును,
ఏకమే యెల్లరు ఎన్నటి కైన!
పరమాత్మ దృష్టిలో పరులు గారెవరు!
"సహచరులకు మధ్య సహవాసమందు
స్వేచ్ఛ సమీరమై వీచుచుండ వలె.
" కలసి మెలగ వలె గాని మీపట్ల
కలయికే బంధమై కలత గారాదు!
"కలయికెంతయొ తీపి కలిగించ వచ్చు
కలసి వుండ వలదు క్షణమైన విడక!
"సంద్రమ్ము వంటిదే సంసారమైన
లహరుల వలె స్వేచ్ఛ లాస్యమాడ వలె!
ఒకరి హృదయమ్ము నొకరు నింపదగు
ప్రేమ మధువుతోటి, హృదయాలు వేరె!
ఆటపాట లొకటై ఆనందమొంది
మనసు ఏకాంతమై మసలుకో వలెను.
వీణలో తంత్రులు వేరుగా నున్న,
వీనులకగు విందు వీణనాదమ్ము!
ఇవ్వలేరొకరికి హృదయమ్ము నెపుడు
పరమాత్మకే చెందు ప్రతి హృదయమ్ము !
ఒకరి చెంత ఒకరై ఉండినప్పటికి
ఎడము ఉండవలెను ఇరువురి మధ్య!
గుడి కప్పు నిలబెట్టు కూడి కంబములు
విడిగనే యుండును వేయి స్తంభములు!
Regarding my translation of "The Prophet".
I had a hunch that the interest generated by the passionate introductory chapter of the arrival of the ship might wane as the story progresses into preachings. My suspicion seems to be coming true. Because, preaching can appear a little dry when dealt with by ordinary mortals.
Versification of such a classic prose is an ardous task. Yet, I will try for some more time to persist with this task.
Request to friends:
I have been tagging some of our friends to my poems etc. This is not meant to thrust stuff on friends, but to ensure that it does reach them. Sometimes it happens that we don't like to get tagged like that. In such a case, I may kindly be let known without hesitation.
దానం:
ధనికుడొకడడిగె దానము గూర్చి:
భావి జీవితమును భద్రమ్ము జేయ
సమకూర్చుకొనెదవు సంపద చాల
దాచుకున్నవి యిచ్చి దయచూప వచ్చు
నిను నీవె అర్పించ నిజము దానమగు.
కాశికేగ జనులు గంగలో మునుగ
వెంట నడచు కుక్క పేరాస తోడ
తిరుగు పయనమున తినవచ్చు ననుచు
దారిలో గోతిని త్రవ్వి లోతుగను
తినెడి బొమిక దాచు తెలివి మీరగను!
బావిలో నీరుండ పానమ్ము కొరకు
భావి దాహము గూర్చి భయపడనేల?
గుర్తింపు కోరుచూ కొసరి యిచ్చెదరు
మనసార యివ్వక మసక బారేను.
కొంచెమున్న నదియె కొందరిచ్చెదరు
సంపన్నమగు వారి సకల జీవితము.
ప్రేమ భావము తోడ విశ్వసించెదరు
బ్రదుకుపై వారికి బహు ప్రీతి గలుగు!
ఉన్న వస్తువులివ్వ ఉచితమ్ము గాను-
తనకు వీలును బట్టి, దానమ్ము గాబోదు.
గుర్తింపు కొరకివ్వ కూడబెట్టినది
కాదు దానమదెల్ల కక్కుర్తి గాని!
కోరి యిచ్చెడి వారు కొందరుండెదరు
కలిమి లేకున్నను కలిగి యున్నదియె!
బ్రదుకు విలువ వారు బాగుగా తెలిసి
పరిపూర్ణ మగురీతి బ్రదుకుచుండెదరు!
సంతసమును పంచి సంబరము జెంది
తరించి పోదురు ధన్య జీవులుగ!
సుకుమార కుసుమము సుమ సౌరభమును
చింతలెరుగ కుండ చిందించు నటుల!
ఏమి దాచగలరు ఎంత కాలమ్ము
అందవలయు వారె అందుకో గలరు!
సమయమొచ్చి నపుడు సంపద లెల్ల
పంచు భాగ్యమపుడు పరులదే యగును.
అందింతు నందువు అర్హుల కెపుడు
ఫలము నిచ్చెడి చెట్టు పలుకునా అట్లు!
రవి తేజ మలరింప, లాలింప సుధయె,
అంద నర్హుడు గాడె అల్ప దానముల!
అర్హతల గొలుచు అధికారము నకు
అర్హులేనా మీరు - అసలు మీరెవరు?
జీవమున కొసగు జీవమ్ము తానె,
పంచు వాడవు గావు ప్రత్యక్షి నీవు!
_-------------_------------------------+-----______________
ప్రవక్త:
అన్న పానములు:
వ్యాపారి యొక్కడు ప్రశ్నించె నపుడు:
'అన్నపానము లందు ఆదర్శమేమి'?
ప్రాణికా హారమ్ము ప్రాణియే గాదె?
పంచు కొందువు గదా పసికూన పాలు?
చెట్టు చేమలు నీకు చేకూర్చు తిండి,
భక్తి భావము తోడ పరిగ్రహించు!
స్వీకరించుము నీవు చెయ్యెత్తి మొక్కి
శ్రేష్ఠ జీవమునకై చేకొందు ననుము!
"అంత మొందించు నిను అజ్ఞాత శక్తి,
ఆశక్తి నను గూడ అంతమొందించు"!
వధజేయు నప్పుడు భావించు మిట్లు:
"నీకైన నాకైన వేరు దారేది,
అమరత్వమునకిటు ఆహారమగుచు
పరమాత్మకే జెందు పారు రక్తమ్ము"!
ఫలము దినుచు నీవు పలుకు మీరీతి,
"నీ భవిత యిటుల నిలుచు నా యందు
నిలుచు నాశ్వాసలో నీ పరి మళము
జీవించెదమిటుల చేరి ఒక్కటిగ"!
"మంచి ఫలములెల్ల మధనమ్ము జేసి
మధురస మ్మేరీతి మగ్గించెదరొ,
నేనట్లె మధువునై నిల్చి పోయెదను
జీవ ఫలమగుచు చిరంజీవి వలె"!
మధుపాత్ర నింపుచు మది నింపు కొనుము
మధువు గ్రోలి నపుడు మన్నించు గతమును!
__________₹_₹₹₹₹__________""
ప్రవక్త (ఖలీల్ జిబ్రాన్)
శ్రమైక సౌందర్యం:
శ్రామికుడడిగెను సాధుపుంగవుని
కాయకష్టము గూర్చి కరుణించి తెలుప;
" కలసి నడచెదరు కాలము తోటి
భూదేవి చేతన పూను మీలోన;
"కదలకుండుటనిన గతితప్పుటగును
ఋతు చక్ర భ్రమణపు రీతి నేమారి!
జీవప్రస్థానపు చైతన్య రథము
పరుగులిడు చుండు పరమాత్మ జేర;
కాలమే వేణువై గావించు చుండు
సంగీత రవళియే శ్రమ జేయు టనిన;
బృంద గానము జేయ ప్రియముగా పరులు
ఊరకే మూగగా ఉండనోపుదువె?
శ్రమ యన్న మీకది శాపమే యనుచు
నమ్మింప జూతురు నష్ట జాతకులు;
ప్రకృతిక్రమములోన భాగమై పోగ
శ్రమ జీవనమున సౌందర్యమనెడి
మధుర స్వప్నము నీకు మనిషివై బ్రదుక
భూమాత తానిచ్చె పుట్టిన క్షణమె!
బ్రదుకుపై ప్రేమయే పనిలోన గలుగు
బ్రదుకు మర్మమదియె భావించి చూడ;
జన్మించుటే నీకు జాడ్యమన్పించ
ఒక శాపమన్పింప ఉదర పోషణయె
ప్రసరించి స్వేదము ఫాల భాగమున
అంతరింపగ జేయు నట్టి రుగ్మతల!
బ్రదుకనునది వొట్టి బాధయే ననుచు
నమ్మించ జూతురు నమ్మకు నీవు;
తపన లేని బ్రదుకు తామసమ్మేలె,
అర్థ రహిత ఆశ అంధ కారమ్మె!
శ్రమ లేని జ్ఞానము సారహీనమ్మె
మమత లేని శ్రమయు మట్టి పాలగును;
ప్రక్కమనిషి తోను పరమాత్మ తోను
శ్రమను గూడి మమత సంధించు నిన్ను;
హృదయ సూత్రముతోడ ప్రియురాలి కొరకు
అల్లినట్టి వలువ *అలవుతో ప్రేమ; (*అలవు=పరిశ్రమము)
సంతసమగు ప్రేమ శ్రమతోడ గలసి
ప్రియురాలికై గట్టు ప్రేమ మందిరమె!
పాలరాతిని దెచ్చి బాగుగా మలిచి
ఆత్మ రూపమ్మును అందులో నిలుపు
శిల్ప కారులు గొప్ప! సేద్యమ్ము జేయు
అల్ప జీవులు మేము అనుకుందురేల?
చేయి తిరిగినట్టి చిత్ర లేఖకులు
పాదరక్షలు కుట్టు పనివాడి కన్న
గొప్ప వాడిగ మీరు గుర్తింతురేల?
అల్పజీవుల మని అనుకుందురేల?
మంద్రమ్ముగా వీచు మలయ మారుతము
ఘన వృక్షములనైన గడ్డి పోచైన
చల్లదనము నిచ్చి సరిసమానముగ
పలకరించును తాను పంచు ప్రేమమును;
కనిపించు ప్రేమయే కష్టించుటనిన
పనిమీద ప్రేమతో పనిజేయకున్న
వీడిపో వెంటనే! వేడుకో గలవు -
గుడి ముందు చెయిజాచి! గొప్ప నీ కేల!!
Khalil Zibran's language is simple. But it is highly nuanced. To translate that nuance into another language is quite a task. I have tried to do justice to the best of my ability, which is not limitless.
Here is my translation for the passage on "Joy and Sorrow".
సుఖ దుఃఖములు:
అడిగె నొక మహిళ అపుడు సాధువును
సుఖ దుఃఖముల సూక్ష్మమ్ము దెలుప!
" దుఃఖమను ముసుగు తొలగించి చూడ
సంతసమె మిగులు సాధువై మోము!
" ఏది మూలమ్మొ నీ హృదయ వేదనకు
అదియె యొసగు చుండు హర్షమ్ము నీకు!
" దుఃఖమెంత మనసు తొలిచి వేసినను
సంతరించు మనసు సంతస మటులె!
" నీ చేతి మధు పాత్ర నిప్పులో కాలి
పుటము బెట్ట బడెను పూర్వ రూపమున!
వీనుల విందగు పిల్లన గ్రోవి
కోత నొందెను గదా కొయ్యగా మునుపు!
" ఆనంద మగు వేళ ఆంతర్యమందు
సుఖదుఃఖ మూలము చూడనొక్కటియె!
దుఃఖమే కలిగెనా తొంగి చూడవలె
మనసు లోతుల లోన మర్మమ్ము నెరుగ"!
"సంతోష జనకమె సంవేదనముగ
మనసు బాధించెడు మనిషికి ఎపుడు!
సుఖ దుఃఖముల మధ్య చూడ మేలేది?
వేర్వేరు గాదు వెరసి రెండొకటె!
" కలసి వచ్చు సుఖము కడగళ్ళ తోటి,
ఒకటి వెల్లడి కాగ ఒకటి దాగుకొను!
" మంచి చెడుల మధ్య మనిషి త్రాసు వలె
ఒరుగు చుండును తాను ఒకవైపుకేసి!
మనసు నిర్మలమైన మనిషి తేలికగ
సమమైన స్థితిలోన చక్కగా నుండు"!
"నిన్ను తులను జేసి నీ మంచి చెడుల
బరువు తూచినపుడు స్పందించ వలెను!
బ్రదుకు తీరును బట్టి పడిలేచు చుండు
సంతోష దుఃఖములు సతతమ్ము మారి!
@@@@@@@@@@@@@@@@
మనుషులను గోడలు విడదీస్తాయి. జగమే గృహమై తెరచిన మనసులతో జీవించమని సాధువు నోట పలికిస్తున్నాడు కవి ఖలీల్ జిబ్రాన్.
గృహములు:
గృహము గూర్చి అడిగె గృహ కార్మికుండు!
* గృహము కన్నను ముందు హృదయమ్ములందు,
పొదరిల్లు గట్టుడు పువుతీగ లల్లి!
చేరుకుందురు గదా సేదతీరంగ
సంధ్యకాలము నందు స్వగృహము మీరు!
మీ మనసులలోన మెదలుచు నుండి
లోన దాగు నొకడు లోకసంచారి!
ఎగిరి పోగోరునా ఏకాంత శక్తి
విహరించ గోరును వినువీధులందు!
మీ మనో రూపమే మీ గృహమ్మనిన,
మెరిసేటి ఎండలో మిన్ను తానంటు!
నిశి రేయిలో తానె నిదురించు చుండి
కలలలో దేలును కల్లగా దదియు,
గూడు విడిచి చేరు కొండ కోనలను!
గృహములన్నియు నేను గిరి సీమ లందు,
వనసీమ లందును పరచి రాగలనె,
వెదజల్లి నట్లుగ విత్తనమ్ములను!
లోయలే వీధులై రోమాంచ రీతి
పచ్చిగడ్డి బయళ్ళు బాటలై పోయి
ఒకరి నొకరు జేరు ఉద్యాన సీమ
ప్రకృతి మాత యొసగు పరిమళమ్మెల్ల
ప్రసరించ గలిగిన పరిసరమ్ములను
ఎంత బాగుండునో, ఇది కదా స్వేచ్ఛ!
సత్యదూరమ్మిది సాధ్యమ్ము గాదు!
కలకల్లయే సుమా, సాధ్యపడగలదె!
పూర్వకాలము వారు పోగు జేసి మిము
భయముతో ఒకచోట బంధించి రిటుల!
పదిలమీ బంధము వదల లేరిపుడు,
అందరానిది స్వేచ్ఛ అంత తేలికగ!
ప్రియమైన ప్రజలార వివరించ గలరె
ఏమి దాచితిరిండ్ల ఇట్లు బంధించి?
మనసులున్నతములై మహిమాన్వితమగు
ఉచ్చస్థితిని మీరు ఊహించ గలరె?
అడ్డుగోడల నెల్ల అధిగమించగను
అమల సౌందర్యమ్ము అందులే మీకు!
కలుగునా మీయింట కలిమి ఈలాగు-
మనసులు వెలిగించు మణిదీప కాంతి!
సుఖమె మీ సంపదై సుఖలాలసతయె
మీరుగోరినపుడు మీకు అందగలదు -
అడుగు పెట్టగలదు -అతిథియై యింట
సాదరముగ మిమ్ము సన్నుతి జేయు
యజమానియై మిమ్ము అదుపులో వుంచు
మీకు గాలము వేసి మీ ఆశయముల
తానె నిర్దేశించు తప్పదిక మీకు!
లోహ సంకెల అది, రూపు సున్నితము!
మందగింపగ జేయు మానసమ్ములను
అన్ని యింద్రియముల నదుపు జేయునది!
స్ఫూర్తి అంతమగును సుఖవాంఛ వలన
జీవితాంతము మిమ్ము క్షీణింప జేయు!
ప్రియమైన జనులార!
స్వేచ్ఛ గోరెడి మీరు చిక్క బోరట్లు,
రుజు వర్తనులెపుడు లొంగ బోరట్లు!
తెరచాప వలె మిమ్ము తీరము నుండి
దూరము గొని పోవు తొలగించి జీను!
విడిపించి బంధము స్వేచ్ఛ గల్గించు
కట్టడి చేయదు కదలిక లెల్ల!
విగత జీవులు చేరి వెలయించు చుండు
గోరీలు మీకవి గూడు కారాదు!
చాటు మాటు వలదు చాటు నీమనసు!
అనంతమగు నీకు ఆకాశమే యిల్లు
ఉషదాచు పొగమంచు ఉండు ద్వారముగ
సంజె రాగములు స్వరపు జాలములు!
@@@@@@&&&&&&@@@@##&&
వస్త్ర ధారణ గూర్చి సాధువు చేత వినూత్న రీతిలో పలికించాడు ఖలీల్ జిబ్రాన్! మనుషులందరూ సద్బుద్ధి గలవారైతే, మాన సంరక్షణ పేరుతో వలువలు ధరించే ఆవశ్యకత ఏమని ప్రశ్నిస్తున్నాడు.
ఈ చర్చ నాగ సాధువులను, జైన స్వాములను జ్ఞాపకం చేస్తున్నది.
వస్త్ర ధారణ :
వలువల విషయము వాక్రుచ్చమనెను
వస్త్రములను నేయు వ్యక్తిసాధువును.
" సౌందర్య మెల్లను చక్కగా దాచు,
వక్రత దాచవు వలువలెప్పుడును!
వలువలందున మీరు వాంఛింఛు స్వేచ్ఛ
బందీలు గావించు పట్టి మిమ్ములను!
సూర్యకిరణములు సోకుచుండ వలె
స్పృశించ వలయును చిరుగాలి మిమ్ము!
చర్మమెరుగుచుండు స్పర్శలో సుఖము
ప్రకృతి స్పర్శ సుఖము వలువకేమెరుక!
బ్రదుకు కాధారమ్ము రవి కాంతి యగును
చైతన్య రూపము చలనమౌ గాలి!
ప్రకృతియె నేసెను వలువలు మాకు
వరముగదా యని పలుకుచుండెదరు.
సిగ్గు మగ్గము కాగ, చేసి పోగులుగ
బలహీనతలజేర్చి ప్రకృతియె నేయు,
మిము లొంగ దీయును మిము జూసి నవ్వు!
మీసిగ్గె యగుచుండు మీపాలి శరము!
ఒడలు దాచుటయేల ఉడుపులు తొడిగి?
మలిన దృష్టుల నుండి మరుగుపొందుటకు!
మలిన దృష్టియె లేని మనుజుల మధ్య
మరుగేల మనిషికి మరల సంకెలగ!
పరవశించును భూమి పదములు సోక
చిరుగాలి నిమురును శిరసుపై మిమ్ము
కనుగొనరా సృష్టి కరుణతో మిమ్ము
కనుపాప వోలెనె కాపాడు సుమ్ము!
@@@@@&&&&&₹₹₹₹₹
ప్రవక్త
(కొన సాగింపు).
మంచి చెడు అని మనుషులను విభజింప లేమని, ప్రతి వ్యక్తి మంచి చెడుల మిశ్రమమే అని చెప్పిస్తున్నాడు కవి, సాధువు నోట!
నేరము - శిక్ష
నేర నిర్ణయ మెట్లు నిర్వహించుటని
అడిగె న్యాయము గూర్చి న్యాయాధికారి!
"నింగి కెగయ స్ఫూర్తి నియమమే లేక
విహరించి వినువీధి విచ్చల విడిగ,
బాధ పెట్టు నరుడు పరులతో బాటు
తన్నుతా గూడను తమకము తోడ!
అందరాని దగును ఆనంద సీమ
నేరభావము చేత నీకు తేలికగ!
అంతరంగము లోన అమలిన మైన
దైవ భావము నీకు దాగియే యుండు!
మాలిన్య రహితమై మది తేలికైన
ఆభావ మందించు అమరలోకమును!
చొరలేదు కలుగులో సూర్య తేజమ్ము
పాముపుట్టను దూరి ప్రసరించబోదు!
ప్రతి వ్యక్తిలో దాగు పావనత్వమ్ము
అటులనే దాగును అతి నీచ బుద్ధి!
అసలు మనిషి దాగు ఆరెంటి నడుమ
ఆమనిషికెరుక అభము శుభములు!
వినిపించు చుండును, వేరు వాడనుచు-
నేరస్తుడిని మీరు నింద జేసెదరు!
ఎంతటి వారైన ఇలలోన నెవరు
మీలోని ఉన్నతి మించి పోలేరు!
మీలోని నైచ్యము మించి పోలేరు
పరమ నీచులెవరు పరిగణించగను!
నేరస్తుడొక్కడె, నేర భావమ్ము
పది మంది మదిలోన పదిలమై యుండు!
పాలిపో గలుగునె పత్రమొక్కటియె
వృక్షమంతటికిని ఎరుక లేకుండ!
ఔన్నత్యమొందగ అడుగు వేసెదరు
అందరొక్కటిగనె ఆదర్శ మదియె!
మీ పయనము లోన మీరంద దలచు
గమ్యమైనను మీరె గమనమ్ము మీదె!
పయనించు చుండగ పలువురు చేరి
పాషాణ ఘాతమై పడిపోయి ఒకడు
తదితరుల కొసగు తగిన జాగ్రత్త!
తమకేల యన్నట్లు తమవారి మేలు
ముందరేగెడి వారి మూర్ఖత గూడ
ఎత్తి చూపునదియె ఎదురైన రాయి!
చంపు వాడికె గాదు చచ్చు వాడికిని
పాపమందు గలదు భాగమ్ము తనది!
దోచుకోబడు వాడు దోషమ్ము నుండి
తప్పించు కొనలేడు తనదు బాధ్యతను!
నీచ కార్యపు నింద నీతి మంతుడికి
నివురు చాటున నిప్పు, నిలచియే యుండు!
ఎవరైన అడిగిన ఎట్లు సాధ్యమని
వేరు కోణము నందు వీక్షింప మనుడు!
తప్పు జేసిన వాడు తరచుగా తానె
వంచింప బడియుండు వధజేయు ముందు!
నీతి పరుడి నీతి నిలచి యుండుటకు
సంఘమ్ము మోయును చాల భారమ్ము!
ఆ భారమును మోయు అసలైన వారు
నిస్సహాయు లగుచు నింద మోసెదరు!
వీరు శిష్టులనుచు, వీరుదుష్టులని
వేర్వేరుగా జూడ వీలుకాబోదు!
చీరనేయునపుడు శ్వేత సూత్రములు
కాల వర్ణము తోటి కలిపి అల్లెదరు!
అటులనే మనుజులు అందరొక్కటియె
పరమాత్మ దృష్టిలో పరులు గారెవరు!
నేసి చీరను తాను నేత కార్మికుడు
శోధించి శ్రద్ధగ చూచు నొకపరి!
చిన్నదారమొకటి ఛిన్నమైనపుడు
పరికించు చుందురు వలువ నంతటిని
మరిమరి చూతురు మగ్గము గూడ
లోతుగా జూతురు లోపమెక్కడని!
పడతి తప్పిదమును పరిగణించుటకు
పతి హృదయము గూడ పరికించ దగును
హృదయమందు కలదె ప్రేమకు చోటు
ప్రేమ లేని మనిషి ప్రేమించ బడునె?
తప్పు జేసిన వాని దండించు నపుడు
తప్పు కారణమును తరచి జూడవలె!
పాప వృక్షపు వేర్లు పలుగుతో త్రవ్వ
బయట పడగలవు పలు రకమ్ములుగ!
భూమాత ఒడిలోన పురులు జుట్టుకుని
మంచి చెడుల వేర్లు మన్నుచు నుండు!
న్యాయ నిర్ణేతలై నరులలో మీరు
నిర్ణయించెదరెట్లు నేరమెవ్వరిదొ?
స్వచ్ఛమానసుడయ్యు పాపమ్ము జేయు-
వ్యక్తినే విధముగ పరిగణించెదరు?
పాపమే జేయని వంకర బుద్ధి
వ్యక్తినే విధముగ పరిగణించెదరు?
వంచకుడై తానె వంచింప బడిన
వాని విషయమెట్లు పరిగణించెదరు?
తప్పు జేసి మనిషి తనతప్పు తెలిసి
వగచుచుండ నదియు పరిగణించెదరె?
మీరు అమలు జేయు మేలు చట్టముల
పరిగణించుటదియు భాగమ్ము గాదె?
శుద్ధ వర్తనుడైన చూపునే వగపు
నేరగాడి మదిని నిలువదా తప్పు!
నడిరేయి మేల్కాంచి నరుడి మానసము
త్రవ్విజూచు కొనును తనలోకె తాను!
పట్టపగలు గాక బట్టబయలుగ
ఎట్లు చేయగలరు ఎరుకతో మీరు?
ఉండు పగలు రేయి ఒక సంధ్యలోనె,
ఉండు మంచి చెడులు ఒక వ్యక్తిలోనె!
వ్యక్తి గొప్పదనము పగలుగా వెలుగ
వ్యక్తి అల్పత్వమే పరచు చీకటిని!
గుడి గోపురమెపుడు గొప్ప కాబోదు
గుడి పునాదిని మించి! గుర్తించ దగును.
@@@@@@@@@@@@@@@@@@@@
చట్టములు:
చట్టములను గూర్చి చర్చ గోరెనొక
న్యాయవాది అపుడు ఆసాధు తోడ!
సాధువిటులనెను సావధానముగ
"చట్టములను జేయ సంతసించెదరు!
హర్షమగును మీకు ఆచట్టములనె
ఉల్లంఘనము జేయ ఉబలాట పడుట!
బాలలందరు జేరి వారధి చెంత
ఇసుక గూళ్ళను చేసి ఇళ్ళు నిర్మించి
అంతలోననె గూల్చి హర్షమొందెదరు
కడలి గూడను నవ్వు కలసి పిల్లలను!
ఎందరో జనులకు ఇలలోన బ్రదుకు
కడలి మాదిరి గాదు కఠినమై యుండు.
శిలవంటి బ్రదుకున చెక్కి చేసెదరు
చాల కష్టము తోడ చట్టము లెన్నొ!
ఈచట్టములు గావు ఇసుకతో యిళ్ళుi
వ్యక్తుల కాఠిన్య ప్రతిరూపములవి.
ఉల్లాసమును జూసి ఓర్చుకోలేరు
పదములు నర్తించ బాధ జెందెదరు!
గర్వపడును ఎద్దు కాడి బంధనకు
బానిసత్వపు కాడి బాగుగా నుండు.
వనసీమలోగల వన్యప్రాణులను
అనుకొను చుండును అల్ప జీవులని!
విడువ లేక పొరను వృద్ధ నాగునకు
విడుచు వాటిని జూచి వెటకార మగును.
విడిచి కుబుసమును విడచిరి సిగ్గు
నగ్నమై కన్పించు నగబాటు అనును!
విందు నానందించి వెక్కిరించెదరు
విందు నొసగు వాని; వింత మానవులు!
కాంతి పథము నందె కాళ్ళూని వారు
వెలుగు నోపగ లేక వెన్ను జూపెదరు!
నీడలే జూతురు నిలుచుండి వారు
నీడలే చట్టమై నిర్ధరించెదరు!
వీరుచూడరు రవి వెలుతురిచ్చునని
నీడలిచ్చుననుచు నిక్కి చూసెదరు.
చట్టముల ఘనత సన్నుతి జేసి
వల్లెయందురు వారు వంగి నీడలను!
కాంతికేసి నడచు కర్మ జీవులకు
నీడతో పనియేమి నిగ్రహమ్మేల!
గమనమై పోవ గాలితో కలిసి
వాయుసూచిక యేల పయనించు మీకు!
కట్టుబాట్లను వీడి కదలి సాగంగ
నేరమెరుగ కున్న నిర్బంధమెట్లు?
వేరు వారల జూచి వెరపేల నీకు
ప్రతి బంధకములను పట్టించుకోకు!
ఇతరులు సృష్టించు ఇనుప చట్టములు
ఆనంద మందున అడ్డు రానీకు!
తామసముగలిగి తంత్రులు దెంచ
మూగబోవును వీణ మ్రోగకుండగను!
విరిచి ఆపగలము వేణు గానమును
కూయ వలదనిన కోయిల వినునె?
9490139639. : Srinivasa Naidu
స్వేచ్ఛ:
స్వేచ్ఛ యనగ నేమి వివరించు మనెను
వక్త యొకడపుడు స్వామి యిట్లనెను:
యజమాని యైనట్లు అతిభక్తి తోడ
స్వేచ్ఛనే దైవము చేసి మ్రొక్కెదరు;
ప్రార్థనా స్థలముల రాజవీధులను
ప్రకటించు చుందురు పదిమంది లోను
చెప్పుకుందురు మీరు స్వేచ్ఛ ముఖ్యమని
స్వేచ్ఛ జీవులమని వెరపెరుగమని;
గొప్ప కొరకు స్వేచ్ఛ గుది బండ యగును
బాధ్యతెరుగకున్న బంధమే యగును;
పరమార్థమని స్వేచ్ఛ పరిగణించెదరు
మిగుల చింత యగును మీతీరు జూడ!
స్వేచ్ఛకగు తపన స్వేచ్ఛ కాబోదు
ఆకోరికయె మీకు ఆటంక మగును;
చింత వంతలు లేని స్వేచ్ఛను గోర
ఎండమావి యగును ఎంతకూ రాక!
తప్పించు కొనరాదు తనదు బాధ్యతలు
స్వీకరించ వలెను చిరునవ్వుతోడ!
అదియె స్వేచ్ఛ నొసగు అందుకో వలెను
కల్మషమ్మెరుగక కలుగు స్వేచ్ఛ!
ఎదురైన గూడను ఎన్నొ కష్టములు
అధిగమించ వలెను అడ్డంకులన్ని!
ఒక పులుగడిగిన ఉజ్జ్వల మ్మైన
ముత్యము వలె నీవు ముక్తుడై పొమ్ము!
నిర్మించుకొంటివి నీవె బంధములు
తొలి రోజులందున, తొలగించుటెట్లు!
వదలకుండునవియె వయసులో నిన్ను
అధిగమించ వలయు నైననూ నీవు!
స్వేచ్ఛయను భ్రమయె వెరసి బంధనము
మిరుమిట్లు గొలిపి మెరసి ఊరించు!
ఆత్మ శకలములే అలుసుగా విసరి
స్వేచ్ఛ పేరున మీరు విడచి పెట్టెదరు!
చెడు శాసనములని చెరిపి వేసెదరు
మీలలాటములందు మీరె వ్రాసితిరి!
చట్టప్రతులు గాల్చ సమసిపో కుండు
నీటితో కడిగినా నిలచియే యుండు!
నిలచియుండును చెడు - నిశ్చయమ్ముగను
మీ మానసమ్ముల- మెదలుచూ ఉండు
తొలగించ దలచిన దుష్ట పాలకుని
దుశ్చింత మీలోన తొలగించ వలయు
ఆచింతలోననె అతనిపై మీకు
ఆదరమ్ము గలిగె, నది వదలవలె!
చెడు తలపులు లేని స్వేచ్ఛ భావనలు
అలుసు జూపనిదగు ఆత్మగౌరవము
కలిగి యున్న జనుల కాంక్షల నణచి
ప్రజల నొక నియంత పాలించ గలడె?
కోరి తెచ్చుకొనినది గురివింద మచ్చ
ఇతరు లెవ్వరును ఇచ్చి యుండనిది!
హృదయమందున నీవె ఇచ్చగించితివి
పరులు నీకెవ్వరు పంచ లేనిదది!
నీయిచ్ఛ, నీస్వేచ్ఛ, నీజుగుప్సయును
నీకు గల్గు తపన, నీదు బాధైన
పరిపూర్ణము గావు భావించి చూడ,
పాక్షికము ప్రతిది బ్రదుకులో నీకు!
వైరుధ్యమగు రీతి భావన లెల్ల
జంటలై నీలోన సంచరించెడిని!
ఛాయ ప్రచ్ఛాయయై సడలి పోవంగ
మలుగు దీపము తాను, మందగించగను
దీపమే వేరొక్క దీపంపు ఛాయ
వెలుగు నీడల మధ్య వెలయు సయ్యాట!
బంధ రాహిత్యమై పరగు నీ స్వేచ్ఛ
పరమ స్వేచ్ఛకు తాను బంధమే యగును!
@@@1£££1&&&1###1
# Light has a Shadow just as freedom has attachment. When that shadow is not there as this light loses power, the light itself becomes a shadow to a glowing light. That that light too has a shadow.
Freedom is shadowed .
############@@@
ప్రవక్త
ఖలీల్ జిబ్రాన్ (కొన సాగింపు)
Reason and passion:
మైత్రేయి అను సాధ్వి ప్రారంభం లో ప్రేమ భావమును గూర్చి, దాంపత్యమును గూర్చి, ఆనంద యోగిని ప్రశ్నించింది.
ఇపుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నది.
హేతువు -భావోద్వేగము
మనిషి మనసులో ఆ రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతునే వుంటుంది. దానికి పరిష్కారమేమిటి?
తాపసి మైత్రేయి తపనతో అడిగె
మరల ముందుకు వచ్చి మహనీయు గాంచి --
" బ్రదుకులో హేతువు ప్రాముఖ్యమేమి?
భావోద్వేగమునకు పరిమితి యేమి"?
తప్పించు కొనరాని ద్వంద్వ భావనలు
మనిషి మానసమున మసలుచు నుండు!
హేతువుకు గలుగు టెరుకయే మీకు
తరచుగా ఘర్షణ తపనల తోటి!
ఒసగ గలనె నేను ఊరట మీకు,
మదిలోని ఘర్షణ మాన్పించ గలనె?
ఉద్యుక్తులై మీరె ఉల్లములందు
జరుగు ఘర్షణలను చల్లార్చ వలెను!
వ్యతిరేక భావపు అతిరిక్త స్థితిని
అనునయించవలెను అనుకూల రీతి!
వైరుధ్య రాగము లైక్యమై పోవ
ఏకమై స్వరము ఇంపుగా మారు!
నరుడికి హేతువే నావ చుక్కాని,
ఓడకు తెరచాప ఉద్వేగమనిన!
విరిగెనా చుక్కాని వెడలదు నావ,
చిరిగెనా తెరచాప చెదరు యానమ్ము!
హేతువొకటె యున్న ఏది జీవితము?
సకలమ్ము బ్రదుకున స్తంభించి పోవు!
తృష్ణ జ్వాల యగును హేతువే లేక,
తనను తానె మనసు తగుల బెట్టు!
హృదయసీమలోన హేతువే జేర -
ఉత్తుంగ స్థితికి ఉద్దీపితముగ,
తర్క పిపాసయే తపనయై పోవ
హృదయ గానము చేయు హేతువే అపుడు!
హృదయకామనగూడ హేతుమార్గమున
భస్మమై యుండియు బ్రదుకును మరల!
తర్కమైనను, మది తపనయే యైన
సమమైన రీతిని సన్నుతించవలె!
హరిత వనము లోన హాయిగా నుండి
పంట చేలు కనుల పండుగ గాగ
మంద్రమై సోకగా మలయ మారుతము
పరవశించునపుడు పరిగణించవలె
మదిలోన శాంతమే మసలు చుండంగ
హేతువే దైవమై హితము జేయునని!
ప్రకృతి ప్రచండమై భయము గల్గించ
వాయు ప్రకోపమై వణక వృక్షములు
ఉరిమి మెరియు చుండ ఊహించు కొనుము
ఉద్ధృతి లోనను ఉండు దైవమని!
పరమాణువే నీవు పరమాత్మ లోన,
వ్రేలాడు ఆకువే విశ్వ వృక్షమున,
హేతువే నీకిచ్చు ఇలలోన సుఖము
ఇచ్ఛయే జవమిచ్చు ఇలలోన నీకు!
మనసులు వెలిగించు మణిదీప కాంతి!
సుఖమె మీ సంపదై సుఖలాలసతయె
మీరుగోరినపుడు మీకు అందగలదు -
అడుగు పెట్టగలదు -అతిథియై యింట
సాదరముగ మిమ్ము సన్నుతి జేయు
యజమానియై మిమ్ము అదుపులో వుంచు
మీకు గాలము వేసి మీ ఆశయముల
తానె నిర్దేశించు తప్పదిక మీకు!
లోహ సంకెల అది, రూపు సున్నితము!
మందగింపగ జేయు మానసమ్ములను
అన్ని యింద్రియముల నదుపు జేయునది!
స్ఫూర్తి అంతమగును సుఖవాంఛ వలన
జీవితాంతము మిమ్ము క్షీణింప జేయు!
ప్రియమైన జనులార!
స్వేచ్ఛ గోరెడి మీరు చిక్క బోరట్లు,
రుజు వర్తనులెపుడు లొంగ బోరట్లు!
తెరచాప వలె మిమ్ము తీరము నుండి
దూరము గొని పోవు తొలగించి జీను!
విడిపించి బంధము స్వేచ్ఛ గల్గించు
కట్టడి చేయదు కదలిక లెల్ల!
విగత జీవులు చేరి వెలయించు చుండు
గోరీలు మీకవి గూడు కారాదు!
చాటు మాటు వలదు చాటు నీమనసు!
అనంతమగు నీకు ఆకాశమే యిల్లు
ఉషదాచు పొగమంచు ఉండు ద్వారముగ
సంజె రాగములు స్వరపు జాలములు!
@@@@@@&&&&&&@@@@##&&
వస్త్ర ధారణ గూర్చి సాధువు చేత వినూత్న రీతిలో పలికించాడు ఖలీల్ జిబ్రాన్! మనుషులందరూ సద్బుద్ధి గలవారైతే, మాన సంరక్షణ పేరుతో వలువలు ధరించే ఆవశ్యకత ఏమని ప్రశ్నిస్తున్నాడు.
ఈ చర్చ నాగ సాధువులను, జైన స్వాములను జ్ఞాపకం చేస్తున్నది.
వస్త్ర ధారణ :
వలువల విషయము వాక్రుచ్చమనెను
వస్త్రములను నేయు వ్యక్తిసాధువును.
" సౌందర్య మెల్లను చక్కగా దాచు,
వక్రత దాచవు వలువలెప్పుడును!
వలువలందున మీరు వాంఛింఛు స్వేచ్ఛ
బందీలు గావించు పట్టి మిమ్ములను!
సూర్యకిరణములు సోకుచుండ వలె
స్పృశించ వలయును చిరుగాలి మిమ్ము!
చర్మమెరుగుచుండు స్పర్శలో సుఖము
ప్రకృతి స్పర్శ సుఖము వలువకేమెరుక!
బ్రదుకు కాధారమ్ము రవి కాంతి యగును
చైతన్య రూపము చలనమౌ గాలి!
ప్రకృతియె నేసెను వలువలు మాకు
వరముగదా యని పలుకుచుండెదరు.
సిగ్గు మగ్గము కాగ, చేసి పోగులుగ
బలహీనతలజేర్చి ప్రకృతియె నేయు,
మిము లొంగ దీయును మిము జూసి నవ్వు!
మీసిగ్గె యగుచుండు మీపాలి శరము!
ఒడలు దాచుటయేల ఉడుపులు తొడిగి?
మలిన దృష్టుల నుండి మరుగుపొందుటకు!
మలిన దృష్టియె లేని మనుజుల మధ్య
మరుగేల మనిషికి మరల సంకెలగ!
పరవశించును భూమి పదములు సోక
చిరుగాలి నిమురును శిరసుపై మిమ్ము
కనుగొనరా సృష్టి కరుణతో మిమ్ము
కనుపాప వోలెనె కాపాడు సుమ్ము!
@@@@@&&&&&₹₹₹₹₹
ప్రవక్త
(కొన సాగింపు).
మంచి చెడు అని మనుషులను విభజింప లేమని, ప్రతి వ్యక్తి మంచి చెడుల మిశ్రమమే అని చెప్పిస్తున్నాడు కవి, సాధువు నోట!
నేరము - శిక్ష
నేర నిర్ణయ మెట్లు నిర్వహించుటని
అడిగె న్యాయము గూర్చి న్యాయాధికారి!
"నింగి కెగయ స్ఫూర్తి నియమమే లేక
విహరించి వినువీధి విచ్చల విడిగ,
బాధ పెట్టు నరుడు పరులతో బాటు
తన్నుతా గూడను తమకము తోడ!
అందరాని దగును ఆనంద సీమ
నేరభావము చేత నీకు తేలికగ!
అంతరంగము లోన అమలిన మైన
దైవ భావము నీకు దాగియే యుండు!
మాలిన్య రహితమై మది తేలికైన
ఆభావ మందించు అమరలోకమును!
చొరలేదు కలుగులో సూర్య తేజమ్ము
పాముపుట్టను దూరి ప్రసరించబోదు!
ప్రతి వ్యక్తిలో దాగు పావనత్వమ్ము
అటులనే దాగును అతి నీచ బుద్ధి!
అసలు మనిషి దాగు ఆరెంటి నడుమ
ఆమనిషికెరుక అభము శుభములు!
వినిపించు చుండును, వేరు వాడనుచు-
నేరస్తుడిని మీరు నింద జేసెదరు!
ఎంతటి వారైన ఇలలోన నెవరు
మీలోని ఉన్నతి మించి పోలేరు!
మీలోని నైచ్యము మించి పోలేరు
పరమ నీచులెవరు పరిగణించగను!
నేరస్తుడొక్కడె, నేర భావమ్ము
పది మంది మదిలోన పదిలమై యుండు!
పాలిపో గలుగునె పత్రమొక్కటియె
వృక్షమంతటికిని ఎరుక లేకుండ!
ఔన్నత్యమొందగ అడుగు వేసెదరు
అందరొక్కటిగనె ఆదర్శ మదియె!
మీ పయనము లోన మీరంద దలచు
గమ్యమైనను మీరె గమనమ్ము మీదె!
పయనించు చుండగ పలువురు చేరి
పాషాణ ఘాతమై పడిపోయి ఒకడు
తదితరుల కొసగు తగిన జాగ్రత్త!
తమకేల యన్నట్లు తమవారి మేలు
ముందరేగెడి వారి మూర్ఖత గూడ
ఎత్తి చూపునదియె ఎదురైన రాయి!
చంపు వాడికె గాదు చచ్చు వాడికిని
పాపమందు గలదు భాగమ్ము తనది!
దోచుకోబడు వాడు దోషమ్ము నుండి
తప్పించు కొనలేడు తనదు బాధ్యతను!
నీచ కార్యపు నింద నీతి మంతుడికి
నివురు చాటున నిప్పు, నిలచియే యుండు!
ఎవరైన అడిగిన ఎట్లు సాధ్యమని
వేరు కోణము నందు వీక్షింప మనుడు!
తప్పు జేసిన వాడు తరచుగా తానె
వంచింప బడియుండు వధజేయు ముందు!
నీతి పరుడి నీతి నిలచి యుండుటకు
సంఘమ్ము మోయును చాల భారమ్ము!
ఆ భారమును మోయు అసలైన వారు
నిస్సహాయు లగుచు నింద మోసెదరు!
వీరు శిష్టులనుచు, వీరుదుష్టులని
వేర్వేరుగా జూడ వీలుకాబోదు!
చీరనేయునపుడు శ్వేత సూత్రములు
కాల వర్ణము తోటి కలిపి అల్లెదరు!
అటులనే మనుజులు అందరొక్కటియె
పరమాత్మ దృష్టిలో పరులు గారెవరు!
నేసి చీరను తాను నేత కార్మికుడు
శోధించి శ్రద్ధగ చూచు నొకపరి!
చిన్నదారమొకటి ఛిన్నమైనపుడు
పరికించు చుందురు వలువ నంతటిని
మరిమరి చూతురు మగ్గము గూడ
లోతుగా జూతురు లోపమెక్కడని!
పడతి తప్పిదమును పరిగణించుటకు
పతి హృదయము గూడ పరికించ దగును
హృదయమందు కలదె ప్రేమకు చోటు
ప్రేమ లేని మనిషి ప్రేమించ బడునె?
తప్పు జేసిన వాని దండించు నపుడు
తప్పు కారణమును తరచి జూడవలె!
పాప వృక్షపు వేర్లు పలుగుతో త్రవ్వ
బయట పడగలవు పలు రకమ్ములుగ!
భూమాత ఒడిలోన పురులు జుట్టుకుని
మంచి చెడుల వేర్లు మన్నుచు నుండు!
న్యాయ నిర్ణేతలై నరులలో మీరు
నిర్ణయించెదరెట్లు నేరమెవ్వరిదొ?
స్వచ్ఛమానసుడయ్యు పాపమ్ము జేయు-
వ్యక్తినే విధముగ పరిగణించెదరు?
పాపమే జేయని వంకర బుద్ధి
వ్యక్తినే విధముగ పరిగణించెదరు?
వంచకుడై తానె వంచింప బడిన
వాని విషయమెట్లు పరిగణించెదరు?
తప్పు జేసి మనిషి తనతప్పు తెలిసి
వగచుచుండ నదియు పరిగణించెదరె?
మీరు అమలు జేయు మేలు చట్టముల
పరిగణించుటదియు భాగమ్ము గాదె?
శుద్ధ వర్తనుడైన చూపునే వగపు
నేరగాడి మదిని నిలువదా తప్పు!
నడిరేయి మేల్కాంచి నరుడి మానసము
త్రవ్విజూచు కొనును తనలోకె తాను!
పట్టపగలు గాక బట్టబయలుగ
ఎట్లు చేయగలరు ఎరుకతో మీరు?
ఉండు పగలు రేయి ఒక సంధ్యలోనె,
ఉండు మంచి చెడులు ఒక వ్యక్తిలోనె!
వ్యక్తి గొప్పదనము పగలుగా వెలుగ
వ్యక్తి అల్పత్వమే పరచు చీకటిని!
గుడి గోపురమెపుడు గొప్ప కాబోదు
గుడి పునాదిని మించి! గుర్తించ దగును.
@@@@@@@@@@@@@@@@@@@@
చట్టములు:
చట్టములను గూర్చి చర్చ గోరెనొక
న్యాయవాది అపుడు ఆసాధు తోడ!
సాధువిటులనెను సావధానముగ
"చట్టములను జేయ సంతసించెదరు!
హర్షమగును మీకు ఆచట్టములనె
ఉల్లంఘనము జేయ ఉబలాట పడుట!
బాలలందరు జేరి వారధి చెంత
ఇసుక గూళ్ళను చేసి ఇళ్ళు నిర్మించి
అంతలోననె గూల్చి హర్షమొందెదరు
కడలి గూడను నవ్వు కలసి పిల్లలను!
ఎందరో జనులకు ఇలలోన బ్రదుకు
కడలి మాదిరి గాదు కఠినమై యుండు.
శిలవంటి బ్రదుకున చెక్కి చేసెదరు
చాల కష్టము తోడ చట్టము లెన్నొ!
ఈచట్టములు గావు ఇసుకతో యిళ్ళుi
వ్యక్తుల కాఠిన్య ప్రతిరూపములవి.
ఉల్లాసమును జూసి ఓర్చుకోలేరు
పదములు నర్తించ బాధ జెందెదరు!
గర్వపడును ఎద్దు కాడి బంధనకు
బానిసత్వపు కాడి బాగుగా నుండు.
వనసీమలోగల వన్యప్రాణులను
అనుకొను చుండును అల్ప జీవులని!
విడువ లేక పొరను వృద్ధ నాగునకు
విడుచు వాటిని జూచి వెటకార మగును.
విడిచి కుబుసమును విడచిరి సిగ్గు
నగ్నమై కన్పించు నగబాటు అనును!
విందు నానందించి వెక్కిరించెదరు
విందు నొసగు వాని; వింత మానవులు!
కాంతి పథము నందె కాళ్ళూని వారు
వెలుగు నోపగ లేక వెన్ను జూపెదరు!
నీడలే జూతురు నిలుచుండి వారు
నీడలే చట్టమై నిర్ధరించెదరు!
వీరుచూడరు రవి వెలుతురిచ్చునని
నీడలిచ్చుననుచు నిక్కి చూసెదరు.
చట్టముల ఘనత సన్నుతి జేసి
వల్లెయందురు వారు వంగి నీడలను!
కాంతికేసి నడచు కర్మ జీవులకు
నీడతో పనియేమి నిగ్రహమ్మేల!
గమనమై పోవ గాలితో కలిసి
వాయుసూచిక యేల పయనించు మీకు!
కట్టుబాట్లను వీడి కదలి సాగంగ
నేరమెరుగ కున్న నిర్బంధమెట్లు?
వేరు వారల జూచి వెరపేల నీకు
ప్రతి బంధకములను పట్టించుకోకు!
ఇతరులు సృష్టించు ఇనుప చట్టములు
ఆనంద మందున అడ్డు రానీకు!
తామసముగలిగి తంత్రులు దెంచ
మూగబోవును వీణ మ్రోగకుండగను!
విరిచి ఆపగలము వేణు గానమును
కూయ వలదనిన కోయిల వినునె?
9490139639. : Srinivasa Naidu
స్వేచ్ఛ:
స్వేచ్ఛ యనగ నేమి వివరించు మనెను
వక్త యొకడపుడు స్వామి యిట్లనెను:
యజమాని యైనట్లు అతిభక్తి తోడ
స్వేచ్ఛనే దైవము చేసి మ్రొక్కెదరు;
ప్రార్థనా స్థలముల రాజవీధులను
ప్రకటించు చుందురు పదిమంది లోను
చెప్పుకుందురు మీరు స్వేచ్ఛ ముఖ్యమని
స్వేచ్ఛ జీవులమని వెరపెరుగమని;
గొప్ప కొరకు స్వేచ్ఛ గుది బండ యగును
బాధ్యతెరుగకున్న బంధమే యగును;
పరమార్థమని స్వేచ్ఛ పరిగణించెదరు
మిగుల చింత యగును మీతీరు జూడ!
స్వేచ్ఛకగు తపన స్వేచ్ఛ కాబోదు
ఆకోరికయె మీకు ఆటంక మగును;
చింత వంతలు లేని స్వేచ్ఛను గోర
ఎండమావి యగును ఎంతకూ రాక!
తప్పించు కొనరాదు తనదు బాధ్యతలు
స్వీకరించ వలెను చిరునవ్వుతోడ!
అదియె స్వేచ్ఛ నొసగు అందుకో వలెను
కల్మషమ్మెరుగక కలుగు స్వేచ్ఛ!
ఎదురైన గూడను ఎన్నొ కష్టములు
అధిగమించ వలెను అడ్డంకులన్ని!
ఒక పులుగడిగిన ఉజ్జ్వల మ్మైన
ముత్యము వలె నీవు ముక్తుడై పొమ్ము!
నిర్మించుకొంటివి నీవె బంధములు
తొలి రోజులందున, తొలగించుటెట్లు!
వదలకుండునవియె వయసులో నిన్ను
అధిగమించ వలయు నైననూ నీవు!
స్వేచ్ఛయను భ్రమయె వెరసి బంధనము
మిరుమిట్లు గొలిపి మెరసి ఊరించు!
ఆత్మ శకలములే అలుసుగా విసరి
స్వేచ్ఛ పేరున మీరు విడచి పెట్టెదరు!
చెడు శాసనములని చెరిపి వేసెదరు
మీలలాటములందు మీరె వ్రాసితిరి!
చట్టప్రతులు గాల్చ సమసిపో కుండు
నీటితో కడిగినా నిలచియే యుండు!
నిలచియుండును చెడు - నిశ్చయమ్ముగను
మీ మానసమ్ముల- మెదలుచూ ఉండు
తొలగించ దలచిన దుష్ట పాలకుని
దుశ్చింత మీలోన తొలగించ వలయు
ఆచింతలోననె అతనిపై మీకు
ఆదరమ్ము గలిగె, నది వదలవలె!
చెడు తలపులు లేని స్వేచ్ఛ భావనలు
అలుసు జూపనిదగు ఆత్మగౌరవము
కలిగి యున్న జనుల కాంక్షల నణచి
ప్రజల నొక నియంత పాలించ గలడె?
కోరి తెచ్చుకొనినది గురివింద మచ్చ
ఇతరు లెవ్వరును ఇచ్చి యుండనిది!
హృదయమందున నీవె ఇచ్చగించితివి
పరులు నీకెవ్వరు పంచ లేనిదది!
నీయిచ్ఛ, నీస్వేచ్ఛ, నీజుగుప్సయును
నీకు గల్గు తపన, నీదు బాధైన
పరిపూర్ణము గావు భావించి చూడ,
పాక్షికము ప్రతిది బ్రదుకులో నీకు!
వైరుధ్యమగు రీతి భావన లెల్ల
జంటలై నీలోన సంచరించెడిని!
ఛాయ ప్రచ్ఛాయయై సడలి పోవంగ
మలుగు దీపము తాను, మందగించగను
దీపమే వేరొక్క దీపంపు ఛాయ
వెలుగు నీడల మధ్య వెలయు సయ్యాట!
బంధ రాహిత్యమై పరగు నీ స్వేచ్ఛ
పరమ స్వేచ్ఛకు తాను బంధమే యగును!
@@@1£££1&&&1###1
# Light has a Shadow just as freedom has attachment. When that shadow is not there as this light loses power, the light itself becomes a shadow to a glowing light. That that light too has a shadow.
Freedom is shadowed .
############@@@
ప్రవక్త
ఖలీల్ జిబ్రాన్ (కొన సాగింపు)
Reason and passion:
మైత్రేయి అను సాధ్వి ప్రారంభం లో ప్రేమ భావమును గూర్చి, దాంపత్యమును గూర్చి, ఆనంద యోగిని ప్రశ్నించింది.
ఇపుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నది.
హేతువు -భావోద్వేగము
మనిషి మనసులో ఆ రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతునే వుంటుంది. దానికి పరిష్కారమేమిటి?
తాపసి మైత్రేయి తపనతో అడిగె
మరల ముందుకు వచ్చి మహనీయు గాంచి --
" బ్రదుకులో హేతువు ప్రాముఖ్యమేమి?
భావోద్వేగమునకు పరిమితి యేమి"?
తప్పించు కొనరాని ద్వంద్వ భావనలు
మనిషి మానసమున మసలుచు నుండు!
హేతువుకు గలుగు టెరుకయే మీకు
తరచుగా ఘర్షణ తపనల తోటి!
ఒసగ గలనె నేను ఊరట మీకు,
మదిలోని ఘర్షణ మాన్పించ గలనె?
ఉద్యుక్తులై మీరె ఉల్లములందు
జరుగు ఘర్షణలను చల్లార్చ వలెను!
వ్యతిరేక భావపు అతిరిక్త స్థితిని
అనునయించవలెను అనుకూల రీతి!
వైరుధ్య రాగము లైక్యమై పోవ
ఏకమై స్వరము ఇంపుగా మారు!
నరుడికి హేతువే నావ చుక్కాని,
ఓడకు తెరచాప ఉద్వేగమనిన!
విరిగెనా చుక్కాని వెడలదు నావ,
చిరిగెనా తెరచాప చెదరు యానమ్ము!
హేతువొకటె యున్న ఏది జీవితము?
సకలమ్ము బ్రదుకున స్తంభించి పోవు!
తృష్ణ జ్వాల యగును హేతువే లేక,
తనను తానె మనసు తగుల బెట్టు!
హృదయసీమలోన హేతువే జేర -
ఉత్తుంగ స్థితికి ఉద్దీపితముగ,
తర్క పిపాసయే తపనయై పోవ
హృదయ గానము చేయు హేతువే అపుడు!
హృదయకామనగూడ హేతుమార్గమున
భస్మమై యుండియు బ్రదుకును మరల!
తర్కమైనను, మది తపనయే యైన
సమమైన రీతిని సన్నుతించవలె!
హరిత వనము లోన హాయిగా నుండి
పంట చేలు కనుల పండుగ గాగ
మంద్రమై సోకగా మలయ మారుతము
పరవశించునపుడు పరిగణించవలె
మదిలోన శాంతమే మసలు చుండంగ
హేతువే దైవమై హితము జేయునని!
ప్రకృతి ప్రచండమై భయము గల్గించ
వాయు ప్రకోపమై వణక వృక్షములు
ఉరిమి మెరియు చుండ ఊహించు కొనుము
ఉద్ధృతి లోనను ఉండు దైవమని!
పరమాణువే నీవు పరమాత్మ లోన,
వ్రేలాడు ఆకువే విశ్వ వృక్షమున,
హేతువే నీకిచ్చు ఇలలోన సుఖము
ఇచ్ఛయే జవమిచ్చు ఇలలోన నీకు!
On pain:
బాధ
మహిళ యొకతపుడు మౌనితో అడిగె
"బాధ గూర్చి చెపుము బాగుగా మాకు"
బాధయనగ నేమి? భ్రమ యనెడి పొర
మనిషి జ్ఞానమును మరుగు పరచుచుండు!
భ్రమయనెడి పొరను బ్రద్దలు గొట్ట
బాధయై తెలియును భావమ్మునందు!
బయట పడు ఫలము బ్రద్దలై చిప్ప
మనసు గాంచును కాంతి మాయ లేకున్న!
ఎరుక గల్గు నపుడు హృదయమ్ము నందు
విడిపోవగా మాయ వెలుగు సోకంగ !
నీ జీవితమ్మందు నిత్య కృత్యముల
హృదయ పూర్వకముగా ఇచ్ఛతో జూడ
సంతసము వలెనె సంకట స్థితియు
అగుపించు చుండును అద్భుతమ్మగుచు!
ఋతు రాగముల వలె హృదయ రాగములు
స్వీకరింతువపుడు చిత్రమౌ రీతి!
దిగులుతో నిండిన దినమును నీవు
నిష్కామ పరుడవై నిలిచి చూసెదవు!
సృష్టించు కొన్నదే చేజేతులార
తప్పు యోచనలతో తరచుగా నీవె!
మనసు బాధకు నీకు మందు నివ్వగల
మంచి వైద్యుడు గూడ మనసులో నుండు!
స్వీకరించుము మందు విశ్వాసుడగుచు
శాంత చిత్తము తోడ, చాలు మేలగును!
*కాన రాకుండెడు కారుణ్య మూర్తి
చేయూత గలిగిన చేయి నీకొసగు
చేదు మందైనను చేయు స్వస్థునిగ!
స్వీకరించుమునీవు చేజార్చు కొనకు!
మందు పాత్రనొసగి మన్నన జేయు
మహనీయ శక్తి మరచిపో వలదు.
* భగవంతుని సహాయము గల హస్తం నీకు స్వస్థతనిస్తుంది.
@@@&&&@@@&&&@@@&&&
The Prophet:
ఖలీల్ జిబ్రాన్ కవితకు స్వేచ్ఛాను వాదము
ప్రవక్త: (కొనసాగింపు)
Truth is a pathless land అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. ఇక్కడ ఖలీల్‌జిబ్రాన్ కవితాత్మకంగా యిస్తున్న సందేశం అటువంటిదే. నేను కనిపెట్టాను సత్యానికి మార్గం, దానికొక దారంటూ లేదు అని తెలుపుతున్నాడు.
ఆత్మ జ్ఞానము
అడిగెనొక మనిషి అపుడు సాధువును
ఆత్మజ్ఞానము గూర్చి అర్థమ్ము తెలుప !
సాధువీ రీతిగా పలికెనపుడు:
అందరకు ఎరుక అంతరంగమున
నిబిడమై యున్నట్టి నిజమేది యనుట!
అయిననూ చెవులార అదియెల్ల వినగ
తలపు గల్గి మనసు తహతహలాడు!
ఎరుక గలిగినను హృదయమ్ము లోన
మాటలందువినగ మనసులో తపన!
కలలలో దాగిన ఖచ్చితమ్మైన
సత్యమ్ము స్పృశియింప చాపల్యమగును!
సవ్యమే ఆకోర్కె, చాటుగా నున్న-
హృదయ వాహిని యెల్ల ఎగసి పోవలెను
ఏరుగా పారుచూ ఏగి పోవలెను
సంద్రమ్ము చేరగా సాగి పోవలెను.
హృదయమందునగల ఎనలేని నిధులు
కన్నులకప్పుడు కనిపించ గలవు!
ఆనిధుల విలువ అంచనా వేయు
కొలమాన మనునది కూడదెప్పుడును
అంతులేనిది ఆత్మ అదియె సంద్రమ్ము
కొలచ జూడవలదు కొలబద్ద తోటి!
చాటవలదెపుడు సత్యమ్మె నాకు-
గోచరించె ననుచు, గొప్పలు వలదు!
నీ కంట బడెను నిజమొక్కటనుచు
తెలుపు వినయముతో తిరుగు లేదనకు!
అంతరాత్మను జేర అసలైన దారి
కనుగొంటి ననకుము కలలోనగూడ!
కనులార దారిలో గాంచితి ననుము
అన్ని దారులందు ఆత్మ సంచారి!
తిన్నగా నుండదు తృణము రీతిగను
వికసించు పద్మమై వేయి రేకులుగ!
@@@###₹₹₹&&&
The Prophet:
ఖలీల్ జిబ్రాన్ కవితకు స్వేచ్ఛాను వాదము
ప్రవక్త: (కొనసాగింపు)
బోధన:
బోధకుడొకడు బోధించమనెను
పూర్తి వివరముగ బోధన గూర్చి:
అపుడు సాధువిట్లనెను:
"ఎవరైన నితరులు ఎక్కించ లేరు
తమలోని జ్ఞానము తలలోకి నీకు!
నీయందె దాగిన నిద్రాణమైన
మేలు జ్ఞానమ్మునే మేలు కొల్పెదరు!
గుడి నీడ లోనుండు గురువర్యుడెపుడు
అతని జ్ఞానము నీకు అందించ లేడు!
విశ్వాస పాత్రుడై విశ్వసించుటయు,
ప్రేమాస్పదుడగుచు ప్రేమనూ నేర్పు!
గురువు జ్ఞానియె యైన కోరడు నిన్ను
తన జ్ఞాన సీమకు దాపుగా జేర!
నీజ్ఞానవిస్తృతి నీకు జూపించి
చేర్చగలడు నిన్ను శిఖరాగ్రమునకు!
అంతరిక్షము లోని అనుభూతి మీకు
తెలుపగా మాటల తెలియగాబోదు!
అనుభవింప వలెను అదియెల్ల మీరె
గగన యానము చేసి గ్రాహ్యమ్ము కాగ!
రంజింప గలుగును రాగమ్ము తీసి
సంగీత కారుడు స్వయముగా పాడి,
వినుట మీవంతు విననిచో మీరు
తనచెవులనె మీకు తగిలించ లేడు!
శాస్త్రమ్ము బోధించ శాస్త్ర కారుండు
విని నేర్వ వలయును వివరమంతటిని,
సంగ్రహించవలెను స్వయముగా మీరు
చేర్చలేడెరుకను చేరి మీమదిని!
పరుల మానసమున పఱగు దర్శనము
పంచుకొనగ లేవు వస్తువైనట్లు!
ప్రతి యొక్కమనిషిని భగవాను డెరుగు
ప్రతి మానవుడు తాను భగవంతు నెరిగి
ధన్యుడై జీవించ తగిన వాడగును!
@@@###₹₹₹&&&
The Prophet:
ఖలీల్ జిబ్రాన్ కవితకు స్వేచ్ఛాను వాదము
ప్రవక్త: (కొనసాగింపు)
స్నేహం :
యువకుడొకడు వచ్చి యోగి నడిగె:
స్నేహమనగ నేమి సెలవియ్యమనుచు!
సాధువిట్లు పలికెను:
మిత్రుడనెడి వాడు మేలొనరించు
అవసరానికతడు అక్కరకొచ్చు!
ప్రేమబీజమునాటి ప్రియముగా నీవు
ఫలము కోసుకొనెడు ఫల క్షేత్రమతడు!
అతడి ప్రేమయె నీకు ఆరగింపగును
ప్రేమతో మదిలోన వెచ్చనై నిలుచు!
ఆకలైనను నీవు అతని జేరెదవు
ఆత్మశాంతి కొరకు అతని జీరెదవు!
చెప్పగలవు నీవు చేదు మాటైన
మెచ్చ లేనప్పుడు మిత్రుడి పలుకు!
మంచి మాటైనచో మనసార నీవె
మెచ్చ గలవు లెమ్ము మిత్రుడి పలుకు!
మెదపకున్నను నోరు - మిత్రుల మధ్య
హృదయాల స్పందన - హెచ్చుగా నుండు?
మాటలే లేకనే మదిలోన గలుగు
ఆశయమ్ములు తమ ఆలోచనలును
అందు కొందురు వారు ఆనంద పడుచు
హృదయమ్ము స్పందించ హృదయమ్ము తోటి!
దూరమైనప్పుడు దుఃఖించ వలదు
తనకు దూరముగనె తనలోనిగుణము
తేట తెల్లమగుచు తెలియు చక్కగను
మిత్రుడిని మిగుల మెచ్చుకోగలము!
క్రింది నుండియె కొండ రీతిగా నుండు
ఎక్కి చూడగ అన్ని ఎత్తుపల్లములె!
మిత్రత్వ మందున మిష యేమి వలదు
లక్ష్యమేమి వలదు లాలస తప్ప!
వెనుకలక్ష్యము దాగ ప్రేమగాబోదు
వలవిసరు టగును స్వచ్ఛమ్ము గాదు.
పంచుకొనుట లోన పరమార్థమేల
ఉన్నంతలోమంచి ఉంచు మిత్రునికి!
బ్రదుకు సాగరమున పడిలేచుటలను
ప్రాణ మిత్రుని తోడ పంచుకోవలెను.
కారాదు స్నేహము కాలహరణము
మిత్రత్వ ధ్యేయము మెరుగైన బ్రతుకు!
నేస్తపు విధియౌను నిన్నాదు కొనుటె
నీ డొల్ల తనమును నింపుట గాదు!
చిందుచుండవలెను చెరిసగమ్మగుచు
స్నేహ మాధురిలోన చేరి సంతసము!
చిన్ని విషయముల చిత్తమ్ము పొందు
తొలి మంచులోగల -త్రుళ్ళింత లెపుడు!
తెరలు తెరల గాలి, తెరచాప ఊగె!
చుక్కానియే కోరె చూపించ దారి
నాకోసమే వేచె నావ సారంగు
సంద్ర ఘోషను విన్న సాటి నావికులు
సహన శీలురె వారు, శాంతితో వినిరి!
ఇంక ఆగను నేను ఏగసిద్ధమ్మె!
సాగరమును జేరె ఝరి పారు చుండి,
పొదవి కొన్నది మాత పుత్రుని తాను!
వీడ్కోలు జనులార, వెడలెద నింక
దినము గడచి పోయె తిరిగి రాగలదు!
ముకుళించినట్లుగ మోవి తామరలు
ఎదురు చూపులతోడ ఇనుడు వచ్చునని!
ఎంత ప్రాప్తమొ అంత ఇదె చాలు లెండు!
ఇది చాలకున్నచో ఇచటనే మరల
కూడి ఎల్లరమును కోరుకొనెదము
భగవానునే జేరి ప్రార్థించ గలము!
మరిచి పోకుడు మీరు మరలి వచ్చెదను
కొంత విరామమ్ము, త కొంత విశ్రాంతి,
ఈగాలి నను మోయ, ఇంచుక నిలుతు!
మరొక మహిళ మోయు మాతయై నన్ను"!
కలసి నట్లనిపించు కలలోన నిన్న!
ఈ ఊరి వారికి ఇచట గడచిన
నా యవ్వనమునకు నా వీడుకోలు!
మీ స్నేహ మాధురి మెదలె గానముగ
మీ ఆశలను జేర్చి మేడెట్టితిని!
కరగి పోయెను నిద్ర కలచెరగినది
కాల గమనమున కడసారి చూపు!
మన జీవితములకు మధ్యాహ్నమయ్యె!
వేర్వేరు దిక్కుల వెడలుద మింక!
జ్ఞాపకాల ఒడిలో చక్కగా మనము
కలుసుకొని మరల కడు ప్రీతి తోడ
మరియొక్క సారి మాటాడు కుందము!
వినిపించ వలె మీరు విమల రాగమును!
కలసి మరల నొక కలలోన మనము
చేయి చేయి కలిపి చేరి చుక్కలను
కట్టు కొందము లెండు గగన హర్మ్యమును!"
సైగచేసెనపుడు సాధువు మరలి
కదిలించిరా నావ కడలి నావికులు
తూర్పు దిశగ నావ దూసుకు వెడలె!
అచటి జనులంత అయ్యయో యనుచు
ఏక స్వరము తోడ ఏడ్వదొడంగ
సంధ్యలోన స్వరము సాగె సంద్రమున
ఆదుఃఖమే మ్రోగె అన్ని దిక్కులను!
మైత్రేయి ఒక్కతి మౌనమ్ము పూని
ఆనావ కనుచూపు నధిగమించుటను
పలుకు లేకుండగ పరికించు చుండె!
అల్లంత దూరాన అది మాయమయ్యె!
జనులెల్ల అటనుండి చనిననూ గూడ
చెలియలి కట్టపై చివరి చూపునకు
నిలచియేయుండెను నిశ్శబ్దముగను
మౌని పలుకొకటి మదిలోన మెదలె!
" కొంత విరామమ్ము, కొంత విశ్రాంతి,
ఈగాలి నను మోయ, ఇంచుక నిలుతు!
మరొక మహిళ మోయు మాతయై నన్ను"!
సమాప్తం!
పఠితలందరకు
జయమంగళం! శుభ మంగళం!
చుక్కానియే కోరె చూపించ దారి
నాకోసమే వేచె నావ సారంగు
సంద్ర ఘోషను విన్న సాటి నావికులు
సహన శీలురె వారు, శాంతితో వినిరి!
ఇంక ఆగను నేను ఏగసిద్ధమ్మె!
సాగరమును జేరె ఝరి పారు చుండి,
పొదవి కొన్నది మాత పుత్రుని తాను!
వీడ్కోలు జనులార, వెడలెద నింక
దినము గడచి పోయె తిరిగి రాగలదు!
ముకుళించినట్లుగ మోవి తామరలు
ఎదురు చూపులతోడ ఇనుడు వచ్చునని!
ఎంత ప్రాప్తమొ అంత ఇదె చాలు లెండు!
ఇది చాలకున్నచో ఇచటనే మరల
కూడి ఎల్లరమును కోరుకొనెదము
భగవానునే జేరి ప్రార్థించ గలము!
మరిచి పోకుడు మీరు మరలి వచ్చెదను
కొంత విరామమ్ము, త కొంత విశ్రాంతి,
ఈగాలి నను మోయ, ఇంచుక నిలుతు!
మరొక మహిళ మోయు మాతయై నన్ను"!
కలసి నట్లనిపించు కలలోన నిన్న!
ఈ ఊరి వారికి ఇచట గడచిన
నా యవ్వనమునకు నా వీడుకోలు!
మీ స్నేహ మాధురి మెదలె గానముగ
మీ ఆశలను జేర్చి మేడెట్టితిని!
కరగి పోయెను నిద్ర కలచెరగినది
కాల గమనమున కడసారి చూపు!
మన జీవితములకు మధ్యాహ్నమయ్యె!
వేర్వేరు దిక్కుల వెడలుద మింక!
జ్ఞాపకాల ఒడిలో చక్కగా మనము
కలుసుకొని మరల కడు ప్రీతి తోడ
మరియొక్క సారి మాటాడు కుందము!
వినిపించ వలె మీరు విమల రాగమును!
కలసి మరల నొక కలలోన మనము
చేయి చేయి కలిపి చేరి చుక్కలను
కట్టు కొందము లెండు గగన హర్మ్యమును!"
సైగచేసెనపుడు సాధువు మరలి
కదిలించిరా నావ కడలి నావికులు
తూర్పు దిశగ నావ దూసుకు వెడలె!
అచటి జనులంత అయ్యయో యనుచు
ఏక స్వరము తోడ ఏడ్వదొడంగ
సంధ్యలోన స్వరము సాగె సంద్రమున
ఆదుఃఖమే మ్రోగె అన్ని దిక్కులను!
మైత్రేయి ఒక్కతి మౌనమ్ము పూని
ఆనావ కనుచూపు నధిగమించుటను
పలుకు లేకుండగ పరికించు చుండె!
అల్లంత దూరాన అది మాయమయ్యె!
జనులెల్ల అటనుండి చనిననూ గూడ
చెలియలి కట్టపై చివరి చూపునకు
నిలచియేయుండెను నిశ్శబ్దముగను
మౌని పలుకొకటి మదిలోన మెదలె!
" కొంత విరామమ్ము, కొంత విశ్రాంతి,
ఈగాలి నను మోయ, ఇంచుక నిలుతు!
మరొక మహిళ మోయు మాతయై నన్ను"!
సమాప్తం!
పఠితలందరకు
జయమంగళం! శుభ మంగళం!
No comments:
Post a Comment