One of the trends among youth these days is DINK. That means 'Double Income No Kids'. Shakespeare had a poetic message for such individuals. He talked interms of an individual's beauty perishing with him and pleads with him to transfer that beauty to the next generation.
Sonnet2:
When forty winters shall besiege thy brow
And dig deep trenches in thy beauty’s field,
Thy youth’s proud livery, so gaz’d on now,
Will be a tatter’d weed, of small worth held:
Then being ask’d where all thy beauty lies,
Where all the treasure of thy lusty days,
To say, within thine own deep-sunken eyes,
Were an all-eating shame and thriftless praise.
How much more praise deserv’d thy beauty’s use,
If thou couldst answer “This fair child of mine
Shall sum my count and make my old excuse,”
Proving his beauty by succession thine!
This were to be new made when thou art old,
And see thy blood warm when thou feel’st it cold.
My translation into Telugu:
స్వేచ్ఛానువాదము:
వదనమందు నలుబది - వత్సరమ్ముల చాలు
విధి నుదుటి గీతలుగ - విరచించె నావ్రాలు!
నిలుచు యవ్వనమందు -నీ పైననే చూపు
అలుసు నడి వయసులో - ఆనకుండును రూపు!
అందమెచటికి బోయె - నని అడుగు చుండెదరు
సౌందర్యనిధి యేల - సమసి పోయె ననెదరు!
కనులు లోతుకు పోవ - కనిపించదందువా
కను వాల్చి లజ్జతో - కల్లయిక నందువా!
అందమంతయు శిశువు - అందుకొనె చూడుడని
అందించి నటులైన - అందాల బాలుడిని,
మెచ్చు కోలుకు తగును - మిగుల సౌందర్యమ్ము
వచ్చి చేరుట వలన -వంశమిట్టి విధమ్ము!
నా అంశయే యితడు - నా అందమే యిదని
నీవనగలవపుడు - నీకె చెందు నతడని!
ముదిమి వయసులోన - ముచ్చటను నీకొసగు
మది శీతలమ్మైన - మరి వెచ్చదనమొసగు!
-------+--------
I had posted Shakespeare's urging to the youth not to shun procreation in his Sonnets 1and 2. In the third Sonnet too, he urges the youth to beget a child.
Here is the original text:
Look in thy glass and tell the face thou viewest,
Now is the time that face should form another,
Whose fresh repair if now thou not renewest,
Thou dost beguile the world, unbless some mother.
For where is she so fair whose uneared womb
Disdains the tillage of thy husbandry?
Or who is he so fond will be the tomb
Of his self-love, to stop posterity?
Thou art thy mother’s glass, and she in thee
Calls back the lovely April of her prime;
So thou through windows of thine age shalt see,
Despite of wrinkles, this thy golden time.
But if thou live rememb’red not to be,
Die single, and thine image dies with thee.
స్వేచ్ఛానువాదము:
*అరవింద వదనమును అద్దమందున గనుము
మరల ఆరూపమే మదిని గావలెననుము;
*మరల ప్రతిరూపమే మది గోర కుండెదవు
తరుణి యొకతిని నీవు తపన పాల్జేసెదవు;
*నీ సంతు పొందుటను నిరసించు కన్యకను
చూసితివె యెచటైన చోద్యమగు నరయగను;
*నీ సంతు వలదనుచు నిర్మించుటేలె యిది-
నీ సమాధిని నీవె, నిరుపయోగమగు విధి;
*తరుణ దినముల లోన తనువులో గలమధువు
తల్లి రూపై తనకు తగ గుర్తు జేయుదువు;
*సమయమిదె నీకైన సమసినను యవ్వనము
సమకూర్చు కొనుటకై సరిక్రొత్త సంబరము;
*వలదందువా గురుతు వసుధపైన చివరకు
కలసి పో వొంటరిగ కాలమందున కడకు!
-----+-----+----+
మనం తరచుగా "All that glitters is not gold" అనే పద్య పాదం వింటూ వుంటాం. తెలుగులో "మెరిసేదంతా బంగారు కాద"నే నానుడి మనకు తెలిసిందే. ఇక్కడ యివ్వబడిన గేయం అందుకు భిన్నంగా వుంది. తిరకాసు గమనించండి.
Here is the poem "All That Is Gold Does Not Glitter" by J.R.R. Tolkien:
"All that is gold does not glitter,
Not all those who wander are lost;
The old that is strong does not wither,
Deep roots are not reached by the frost.
From the ashes a fire shall be woken,
A light from the shadows shall spring;
Renewed shall be blade that was broken,
The crownless again shall be king."
నా స్వేచ్ఛాను వాదము:
పసిడిదైన ప్రతిదీ మెరిసి పోదు
లోక సంచారులు దారి తప్పబోరు
చెడదు పాతదైన చేవగలదేది
మంచు చేరలేదు మట్టిలోని వేరు
నివురు చాటునుండి నిప్పు రవ్వ యెగయు
నీడ చాటునుండి నిగుడు కిరణాలు
విరిగినట్టి తృణమె విరియునులే క్రొత్తగ
పదవి పోయిన రాజు ప్రభువు తానె మరల.
-----+------
షేక్ స్పియర్ నాటకం " As You Like It" లోని "All the World is a Stage" అన్న స్వగతం
( Soliloquy) జగద్విఖ్యాతం. మానవ జీవితం లోని వివిధ దశలను అలనాటి ఆంగ్లేయ సమాజపు కోణంలో చిత్రీకరించిన కవిత. దానికి నా స్వేచ్ఛాను వాదం.
జగన్నాటక రంగము
జగములోనుండెడి జనులెల్ల నటులు
విశ్వమే జనులకు వేదిక యగును
ప్రతి నిత్యమును వచ్చు వారుమరి
వేదిక దిగిపోయి వెడలెడి వారు
పురుషుడొకడు తాను పోషించు నందు--
అతడి కాలమునందు అంకములేడు!
తొలుత శిశువు పాత్ర దోబూచు లాట;
పిదప బడికి వెళ్ళు పిలగాడు ఏడ్చు
మోయు పుస్తకముల, మొండి చేయుచునె;
ప్రేమికుడైపోవు పిదప కాలమునందు
విరహతాపముతోడ వేగిపోవుచును
కవిత లల్లును భామ కనుబొమ్మ పైన!
తరువాతి దశలోన తాను సైనికుడు
గంభీరముగ నుండు గడ్డము పెంచి,
దేశమును రక్షింప తెగువను జూపి
ప్రాణమిచ్చెదనని ప్రతినలు బూను:
వీరుడనితనకు పేరు ముఖ్యమ్ము
పౌరుషమును జూపు పరువు గాపాడ!
పంచమ దశలోన పరిణతి గలుగు
పొట్ట కుంభము వలె పొడుచుకు వచ్చు!
పదిమంది లోతాను వ్యవహరించుచును
పెద్దమనిషివలె పేచీలు మాన్పు!
ఆరవ దశలోన అతడు దీనముగ
వదలు దుస్తుల తోడ, వణకుచూ నుండు
తడబడును నడక, దగ్గుచు నుండు
స్వరములో అపశృతి, సగమె విన్పించు!
సప్తమ దశయిక చరమాంక మేలె!
రూపు సమసి పోవు ,రుచిని గోల్పోవు
బోసి పోవును నోరు, బోడిగ గుండు,
తూట్లు బడు కనులు,తొఱ్ఱిదై నోరు
పసితనమె మరల పరికించి జూడ,
భూమాత ఒడిలోనె పునరపి నిద్ర!
--------+-------
17/3/25
@Robert Fraust: "Into my own"కు
నా స్వేచ్ఛాను వాదము: (ఛం: అనియతము)
కొత్తదనం కోరుకుని, ఏదో చెయ్యాలనుకునే టీనేజర్ భావావేశానికి ఫ్రాస్ట్ రూప కల్పన:
నా ఆంతర్యంలో:
కోరికొక్కటి గలదు,
అచిర కాలము నిలచి అచలమై యుండు
ఆ దట్టమగు వృక్షములు
అంతవరకె గాక అవని యంచుల దాక
విస్తరించ వలెననుచు!
ఆప బడక నేను - ఆ అనంత తీరము
చేరుకోవలెను!
మరల ఈ మైదానమే మరల ఈ రహదారులే
కనదలచు కోలేదు కష్టమైనను నేను!
వెనుదిరుగుటేలనో నేనెరుగ నైతిని!
నా వారలెల్లరు నను కానగా దలచి
నా దారిలో వారును నడచి వచ్చినను
నన్నాపరాదు నా ప్రేమ పాత్రులెయైన!
తెలియ వచ్చునపుడు
మరియింత ఎదిగినా మారలేదు నేనని
తెలియ వచ్చు వారికి!
--------++--------
ఫ్రాస్ట్ కవిత కనువాదం:
అశాశ్వతమ్:
లేజిగురాకు వర్ణమ్ము స్వర్ణమ్ము
అచిరమగునా అందమెపుడు!
పుట్టుచూ ఆకు పూవువలె నుండు
కొంత కాలమె తా కోమలముగనుండు
అపుడు సంతరించు నది ఆకు రూపు!
నలిగి పోగలదు నందనపు అందమ్ము,
చిరకాలముండునా ఆసువర్ణ వర్ణమ్ము!
--------
@మరొక అనువాదం:
Robert Frost poem : A poem begins కు నా అనువాదం:
(అనియతం)
కవిత మొదలవగ గొంతుక
పూడుకొని పోవు!
ఇంటి పై మమకారమో
ప్రేమ వికారమో!
పరిపూర్ణ మగుటకు పరితపించి
బహిర్గతమగు భావావేశము!
పరిపూర్ణమగు కవిత యనిన
ఆవేశమందుకొనుటె తగు ఆలోచనను!
అందుకొనుటె పలుకులను ఆలోచనలు!
--------------
@My translation of poem by John Donne :
"For whom the bell Tolls" :
No man is an island, entire of itself
Each is a piece of the continent, a part of the main
If a clod be washed away by the sea, Europe is the less
As well as if a promontory were
As well as if a manor of thine own
Or of thine friend's were
Each man's death diminishes me, for I am involved in mankind
Therefore, send not to know for whom the bell tolls, it tolls for thee
ఎవరిదో వంతు: (పరలోక యానము)
ఏకాకి గాబోరు ఎవ్వరీ ధరణి
సంద్రమందున దీవి సాటి గారెవరు!
ధరణి ఖండమున తాను భాగమ్ము
అఖిలమందున మనిషి అల్పమౌ కణిక!
మట్టి గడ్డ మునుగ సంద్రము నందు
కొంత మేరకు భూమి కుంచించు కొనును!
దీవి మాత్రమె యైన దేశమే యైన
అల్పమే భేదమ్ము ఆమేరకైన!
మనిషి ఒక్కడు జేర మరు భూమి యందు
లోకమునకగును లోటు పూడ్చనిది!
చెందు నెల్లెర కది చింత నాకగును,
మనుజ లోకము నందు మనుచుందు గాన!
ఎవ్వరడగకుడు ఎవరి వంతనుచు
అడుగు వారికి వచ్చు అటునుండి పిలుపు
-----+-----+
Swinburne కవిత In a Garden కు స్వేచ్ఛాను వాదము:
(అనియతము):
తోటలో పాపతో:
" పాపా! పాపా! అవిగో పువ్వులు"
పూల కన్నా మిన్న
మనము కలలో కన్న
అందాల కన్న
మంచి కలలను తాను
కనగలదు పాపాయి!
"పాపా! పాపా! అవిగో గువ్వలు"
పలుకులన్నిటి కన్న
గువ్వ పాటలు మిన్న!
గువ్వపాటల కన్న
మిన్నయగు పాట
పాపాయి నోట!
"పాపా! పాపా!
అదిగదిగో చందమామ!"
కనులార గనును పాపాయి
గగన సీమలో చందురుని
రేయి పగలు కాగ
వెలుగు ప్రేమలొలుక!
"విన్నావా పాపా, కడలి చేసే సవ్వడి!"
కనులు చికిలించు పాప
చెవులు రిక్కించు బాగ
ఎచటిదీ శబ్దమని
చిత్రముగ చూచు!
" మినుకు మినుకు మను తార
కనుగొంటివా పాపా?"
అరచేయి చాచును
అందుకొన జూచును
సృష్టి లోని అందాలు
అన్ని తనకు చెందాలని
ఆశ గల పాపాయి!
"గంట మ్రోగు చున్నది
వింటివా పాపా?"
కనులు మూత పడుచుండె
పాప సోలి పోవుచుండె!
ఈ వేళ కిక చాలు
అనుకొన్నవి పువ్వులు!
ముడుచుకొన్నవి రెక్కలు!
"నిదురపో నిదురపో
నిదురపో పాపా!
నా కంటి వెలుగా!
నిదురలోన కనుము
మాకన్న మంచి కలలు!
రేయి వెడలగ మరలి
పగటి వెలుగౌ మరల!"
+-----+----+
1/9/25
William Blake కవిత "The Tyger" (1794) కు నా స్వేచ్ఛానువాదము:
శార్దూల సృష్టి:
శార్దూలమా ఇట్లు జ్వాలవై మెరిసి
గహనాంతరమ్ముల కారు చీకటుల
పాదచారిగ రేయి పయనించు నిన్ను
ఏ దివ్యమగు శక్తి ఇటుల సృష్టించె
భయము గొల్పునటుల బహు సుందరముగ!
నిప్పు కణిక బోలు నీకంటి తళుకు
అశని పాతము నుండి అరుదెంచె నేమొ!
అంకురించిన దేమొ అవని గర్భమున!
సృజియించె నెట్టులా సృష్టి కర్త నిను
అగ్ని చేతను బట్టి అమరించె నెట్లు?
ఏకళల పిపాసి ఏహస్తవాసి
ఇంత దృఢ హృదయ మీరీతి గూర్చె!
హృదయ కంపన లోన ఏశక్తి దాగె!
ఏసమ్మెటను వాడె ఏకొలిమి అది
ఎట్టి పట్టెడ వాడె, ఇంత సోయగము
తీర్చి దిద్దుటకైన తెంపు గావలదె
భయము గొలుపు రీతి, ప్రాణమ్ము పోసి!
తారలు వీడుచు తమ కొలువులను
దివిని బాష్పములతో దిగులుగా తడుపు,
ఆసమయమునందు ఆ దివ్యశిల్పి
నిను మలచిన తన నిపుణత గాంచి
మురిసి పోయెనె యేమొ విరియగా నగవు!
శాంత రూపమ్ముతో సాధువై బ్రదుకు
అజము సృష్టించిన నాతడే నిన్ను
సృష్టించెనా యింత చిత్రమౌ రీతి!
శార్దూలమా!
(ఈ రచన పైన పేర్కొనబడిన కవితకు నా స్వంత అనువాదమేనని హామీ ఇస్తున్నాను).
మూలము:
"The Tyger" By William Blake
Tyger Tyger, burning bright,
In the forests of the night;
What immortal hand or eye,
Could frame thy fearful symmetry?
In what distant deeps or skies.
Burnt the fire of thine eyes?
On what wings dare he aspire?
What the hand, dare seize the fire?
And what shoulder, & what art,
Could twist the sinews of thy heart?
And when thy heart began to beat.
What dread hand? & what dread feet?
What the hammer? what the chain,
In what furnace was thy brain?
What the anvil? what dread grasp.
Dare its deadly terrors clasp?
When the stars threw down their spears
And water'd heaven with their tears:
Did he smile his work to see?
Did he who made the Lamb make thee?
Tyger Tyger burning bright,
In the forests of the night:
What immortal hand or eye,
Dare frame thy fearful symmetry?